alusandalu masala curry recipe By , 2017-07-20 alusandalu masala curry recipe Here is the process for alusandalu masala curry making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: అలసందలు: 1cup,టమోటో పేస్ట్ : 1cup,ధనియాలా పొడి: 1tsp,పోపు దినుసులు: 1tsp,గరం మసాలా: 1tsp,ఉప్పు: రుచికి సరిపడా,పుదీనా : కొద్దిగా,తరిగిన ఉల్లిపాయ ముక్కలు: 1/4cup,కొత్తిమీర : కొద్దిగా,అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tsp,కరివేపాకు : రెండు రెమ్మలు,ఎండు మిరిపకాయలు : 2,తరిగిన పచ్చిమిర్చి: 2,పసుపు : చిటికెడు,నూనె: 3tbps, Instructions: Step 1 ముందుగా అలసందలను రెండు గంటల పాటు నానబెట్టి, కుకర్ లో ఒక విజిల్ వచ్చేవరకు. ఉడికించాలి. తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి అందులో నూనె వేసి వేడి అయ్యాక అందులో ఆవాలు , జీలకర్ర వేసి వేసి చిటపటాలాడించాలి. Step 2 తర్వాత అందులోనే ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు కూడా వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. Step 3 ఇప్పుడు: తరిగిన పచ్చిమిర్చి వేసి వేగించాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకొన్న అలసందలు వేసి ఫ్రై చేయాలి. Step 4 పోపుతో అలసందులు బాగా మిక్స్ అయిన తర్వాత అందులో చిటికెడు పసుపు వేసి మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. Step 5 కొద్దిసేపు వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకూ వేగించాలి. Step 6 తర్వాత టమోటో పేస్ట్ , కొద్దిగా అవసరం అయితే నీళ్ళు కూడా పోసి మిక్స్ చేయాలి. Step 7 తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి మొత్తం మిశ్రమం కలగలుపుకోవాలి. మీడియం మంట మీద మూత పెట్టి కర్రీ చిక్కబడే వరకూ ఉడికించాలి. Step 8 చిక్కబడుతున్న సమయంలో ధనియాల పొడి, గరం మసాలా, పుదీనా, కొత్తిమీర తరుగు వేసి మిక్స్ చేసి, కర్రీ దగ్గర పడే వరకూ ఉడికించాలి. అంతే అలసందలు మసాలా కర్రీ రెడీ . గార్నిషింగ్ గా కొత్తిమీర చిలకరించి వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే అలసందల కర్రీ రెడీ..  
Yummy Food Recipes
Add
Recipe of the Day