Dum Aloo Recipe By , 2017-11-04 Dum Aloo Recipe Dum Aloo Recipe , Food, food recipes Prep Time: 10min Cook time: 25min Ingredients: ఆలు చిన్నవి - పావుకేజీ,టమాటలు - మూడు,ఉల్లిపాయలు - నాలుగు,అల్లంవెల్లుల్లి పేస్ట్ - ఒక స్పూను,పసుపు , ఉప్పు - తగినంత,నూనె - ఒక పెద్ద కప్పుతో,పెరుగు - ఒక చిన్న కప్పుతో,గరంమసాలా - ఒక స్పూను,కొత్తిమీర - తగినంత,కారం - రెండు స్పూనులు,ధనియాలపొడి - ఒక స్పూను, Instructions: Step 1 ముందుగా చిన్న బంగాళదుంపలని కుక్కర్ లో ఉడికించి చెక్కుతీసి పెట్టుకోవాలి. ఆ సమయంలోనే టమాటను నీళ్ళల్లో ఉడికించాలి.  Step 2 ఉల్లిపాయలని సన్నగా తరిగి వేయించాలి. ఆ తర్వాత చల్లారాకా టమాట చెక్కుతీసి మెత్తగా గ్రైండ్ చేయాలి. * అలాగే ఉల్లిపాయలని కూడా మెత్తగా గ్రైండ్ చేయాలి. రెండు చెమ్చాల  నూనె  వేసి కాగాకా ముందుగా ఉల్లిముద్ద, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. Step 3 ఆ మిశ్రమం కొంచం ఎర్ర రంగుకి వస్తుండగా, పసుపు, కారం, ధనియాల పొడి, గరంమసాలా,  ఉప్పు వేసి కలపాలి. Step 4 ఆ తరువాత టమాట గుజ్జు, పెరుగు, చిన్న గ్లాసు నీళ్ళు పోసి ఉడకనివ్వాలి. గ్రేవీ ఉడుకుపట్టాకా ముందుగా ఉడికించి పెట్టుకున్న చిన్న ఆలులని డీప్ ఫ్రై చేసి ..చల్లారాక టమాట ,ఉల్లి  గ్రేవీ లో  వేసి ఓ పదిహేను నిమిషాలు మగ్గించాలి. దించేముందు కొత్తిమీర వేస్తే దమ్ ఆలూ కరీ సిద్ధం.                    
Yummy Food Recipes
Add
Recipe of the Day