Butter Paneer Masala By , 2017-11-03 Butter Paneer Masala Here is the process for Butter Paneer Masala making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: పనీర్ - పావుకేజీ,టమాటా - నాలుగు,పుదీనా - కొద్దిగా,గరంమసాలా -ఒక స్పూను,ఎండు మిరపకాయలు - ఐదు,ఉల్లిపాయలు - మూడు,జీడిపప్పు - కొద్దిగా,అల్లం, వెల్లుల్లి ముద్ద - ఒక స్పూను,మెంతికూర - రెండు కట్టలు,రెడ్ ఆరంజ్ కలర్ - చిటికెడు,కొత్తిమీర - కొద్దిగా,వెన్న - ఒక కప్పు,ఉప్పు, నూనె - తగినంత, Instructions: Step 1 ముందుగా పనీర్ శుభ్రంగా కడిగి ముక్కలుగా కోసి ఉంచుకోవాలి.  Step 2 తర్వాత  టమాటాలు, గరంమసాలా, ఎండు మిరపకాయలు, పుదీనా, మెంతికూర, ఉల్లిపాయలను ముక్కలుగా కోసి కలిపి, కొంచెం ఉప్పు కూడా వేసి స్టౌమీద పెట్టి ఉడికించాలి. Step 3 తరువాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నె స్టౌ మీద పెట్టి, నూనె పోసి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను ఎర్రగా వేయించి, దానికి అల్లం, వెల్లుల్లి ముద్దను కలిపి వేయించాలి. Step 4 ఆ తర్వాత జీడిపప్పు కూడా వేసి ఫ్రై చెయ్యాలి. ఇప్పుడు గ్రైండ్ చేసిన టమాటా రసాన్ని కొంచెం కొంచెం వేస్తూ, నూనె తేలేవరకూ ఫ్రై చేస్తే గ్రేవీ తయారవుతుంది.    Step 5 గ్రేవీకి రెడ్ ఆరంజ్ కలర్ కలిపి, తగినంత ఉప్పు వేసుకోవాలి.    Step 6 అలాగే ముందుగా కట్ చేసిన పనీర్ ముక్కల్ని గ్రేవీలో కలిపి, పదినిమిషాలు మూతపెట్టి ఉడికించాలి. *తరువాత వెన్న  కలిపి దించి, సన్నగా తరిగిన కొత్తిమీరను పైన జల్లాలి. అంతే ఎంతో రుచికరమైన బటర్ పనీర్ మసాలా రెడీ.              
Yummy Food Recipes
Add