Stuffed Snake Gourd Recipe By , 2017-11-02 Stuffed Snake Gourd Recipe Here is the process for Stuffed Snake Gourd Recipe making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: పొట్లకాయ - ఒకటి,ఉల్లిపాయలు - రెండు,బంగాళాదుంపలు - రెండు,క్యారెట్ - ఒకటి,పచ్చి బఠాణీలు - అర కప్పు,వెల్లుల్లి రెబ్బలు - రెండు,నిమ్మకాయ - ఒకటి,పచ్చిమిర్చి - మూడు,కొత్తిమీర - కొద్దిగా,లవంగాలు - రెండు,పసుపు - చిటికెడు,గరంమసాలా - ఒక స్పూను,కారం - తగినంత,బియ్యపుపిండి - అరకప్పు,శనగపిండి - అరకప్పు,నునె, ఉప్పు - తగినంత, Instructions: Step 1 ముందుగా పొట్లకాయను శుభ్రంగా కడిగి రింగులు రింగులుగా కట్ చేసుకోవాలి. Step 2 పొట్లకాయలో వున్న గింజలు తీసివేసి, ఉప్పు రాసుకోవాలి.వాటిని ఒక గిన్నెలో వేసుకొని పక్కన వుంచుకోవాలి.  Step 3 ఇప్పుడు క్యారెట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు తరిగి ఉంచుకోవాలి.  Step 4 తర్వాత బఠాణీలు, క్యారెట్ ముక్కలను ఒక గిన్నెలో తీసుకొని, పొట్లకాయ ముక్కలను మరొక గిన్నెలో పెట్టి ఐదు నిమిషాల పాటు ఉడికించాలి.    Step 5 అలాగే  బంగాళాదుంపలను కూడా కట్ చేసి కుక్కర్‌లోనే ఉడికించాలి.    Step 6 బంగాళాదుంపల ముక్కలు చల్లారిన తరువాత వాటి తోలు తీసి మెత్తగా ముద్ద చేసుకోవాలి.    Step 7 బియ్యపుపిండి, శనగపిండిలో తగినన్ని నీళ్ళు పోసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.    Step 8 ఒక బాణలిలో నునె పోసి కాగిన తరువాత ఉల్లిపాయముక్కలు, వెల్లుల్లి, ఉప్పు వేసి వేయించుకోవాలి.తరవాత గరంమసాలా, లవంగాలు, పసుపు, కారం, పచ్చిమిర్చి వేసి వేయించాలి.    Step 9 ఈ మిశ్రమంలో బంగాళాదుంప ముద్ద వేసి బాగా కలిపిన తర్వాత నిమ్మరసం పిండుకోవాలి.    చివరికి కొత్తిమీర వేసి దించేయాలి. ఇప్పుడు ఉడకబెట్టిన పొట్లకాయ ముక్కలలో ఈ కూర ముద్దను కూర్చి ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో ముంచి నూనెలో వేయించుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే పొట్లకాయ మసాలా రోల్స్ రెడీ.    
Yummy Food Recipes
Add