pyas ki pool masala recipe By , 2017-06-26 pyas ki pool masala recipe Here is the process for pyas ki pool masala making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 10min Ingredients: ఉల్లిపాయలు-4 (మీడియం సైజువి),మైదాపిండి-200 గ్రాములు,మంచినీళ్లు-సరిపడా,ఉప్పు- తగినంత,కారం- 2 టీస్పూన్లు,కొత్తిమీర-2 కట్టలు,నూనె-వేయించడానికి సరిపడా,మసాలా కూరకోసం పెరుగు-2 కప్పులు,ఎండుకొబ్బరి తురుము-4 టేబుల్‌స్పూన్లు,గసగసాలు-4 టేబుల్‌స్పూన్లు,పచ్చిమిర్చి-4,ఎర్ర కారం-2 టీస్పూన్లు,గరంమసాలా-2 టీస్పూన్లు,అల్లంవెల్లుల్లి పేస్ట్‌-2 టేబుల్‌స్పూన్లు,కొత్తిమీర-2 కట్టలు,ఉప్పు-రుచికి సరిపడా,నూనె-6 టేబుల్‌స్పూన్లు, Instructions: Step 1 ఉల్లిపాయల పొట్టు తీసి పైనా కిందా ముచ్చికా తోక కోసి తిరగే యాలి.  Step 2 తర్వాత పైనుంచి కిందిభాగం వరకూ పూర్తిగా తెగిపోకుండా ఎనిమిదిసార్లు పద్మం ఆకారంలో గాట్లు పెట్టి నట్లుగా పువ్వు మాదిరిగా కోయాలి.  Step 3 తర్వాత విడిగా ఓ గిన్నెలో మైదా వేసి అందులో ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి పలుచగా కలపాలి.  Step 4 అందులో ఉల్లిపువ్వుల్ని వేసి పిండి మిశ్రమం ఉల్లిపొరల్లోకి వెళ్లేలా పట్టించాలి. తర్వాత వేడి నూనెలో వేయించి తీసి పెట్టుకోవాలి.  Step 5 తర్వాత వేరే బాణలిలో గసగసాలు, ఎండుకొబ్బరి వేయించి తీసి చల్లారాక మిక్సిలో పేస్ట్‌ చేసి పెట్టుకోవాలి.  Step 6 బాణలిలో నూనె వేడి చేసి గరంమసాలా, అల్లంవెల్లుల్లి పేస్ట్‌ వేసి పచ్చివాసన పోయేవరకూ వేయించాలి.  Step 7 తర్వాత గసాలు, కొబ్బరి ముద్ద వేసి వేయించాలి. అందులోనే కారం, పచ్చిమిర్చి, పెరుగు వేసి కలిపి ఉడికించాలి. Step 8  గ్రేవీ బాగా ఉడికి పొడిగా అవుతుంటే మళ్లీ కొంచెం నీళ్లు పోసి కలపాలి.  Step 9 అందులోనే వేయించిన ఉల్లిపువ్వులు వేసి ఓ నిమిషం ఉడికించి దించి కొత్తిమీరతో గార్నిష్‌ చేసి వేడి రోటీలోనైనా, అన్నంలోనైనా వడ్డిస్తే సరి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day