Mixed Sprouts Curry By , 2017-10-30 Mixed Sprouts Curry Here is the process for Mixed Sprouts Curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: స్ప్రౌట్స్ ....ఒక పెద్ద కప్పుడు,ఉల్లితరుగు ...ఒక చిన్న కప్పుడు,టమాట ప్యూరీ...4 చెంచాలు,పెసరపప్పు ...4 చెంచాలు,సెనగ పిండి ..ఒక చెమ్చా,పచ్చి కొబ్బరి ...అయిదు చెంచాలు,కారం ..రెండు చెంచాలు,ఉప్పు ..రుచి కి తగినంత,పసుపు ...చిటికెడు,పెరుగు ...రెండు చెంచాలు,జీలకర్ర పొడి ...పావు చెమ్చా,ధనియాల పొడి ...అర చెమ్చా,కసూరి మేతి ....ఒక చెమ్చా,డ్రై మాంగో పౌడర్ ...అర చెమ్చా,నూనె ..తగినంత,ఆవాలు, జీలకర్ర ..ఒక చెమ్చా, Instructions: Step 1 నాన పెట్టిన గింజల్ని కుక్కర్లో ఒక అయిదు విసిల్స్ వచ్చేవరకు వుంచి ..దించాలి. . Step 2 ఈ లోపు వేరే బాణలిలో నూనె వేసి ఆవాలు, జీలకర్ర ,కసూరి మేతి వేసి అవి వేగాక ఉల్లి తరుగు వేసి వేయించాలి. * ఉల్లిపాయలు వేయించి నప్పుడు చిటికెడు ఉప్పు వేస్తె త్వరగా వేగుతాయి.  Step 3 ఉల్లి పాయలు ఎర్రగా అయ్యాక అందులో టమాటా ప్యూరి వేసి కలపాలి. అది ఒక్క ఉడుకు ఉడకగానే ...అందులో ధనియాలపొడి నుంచి , పసుపు, కారం తో సహా అన్ని వేసి కలపాలి. (కొబ్బరి ,సెనగపిండి , పెరుగు తప్ప ). Step 4 అవి బాగా కలిసాక ముందుగా ఉడికించి పెట్టుకున్న స్ప్రౌట్స్ , ఉప్పు , వేసి కలపాలి.   Step 5 కూర ఉడకటం మొదలు కాగానే కొంచం సేపు మూత పెట్టి ఉంచాలి..అప్పుడు అన్ని రుచులు స్ప్రౌట్స్ కి పడతాయి. * దించేముందు సెనగ పిండి, పెరుగు, కొబ్బరి వేసి కలిపితే చాలు.   Step 6 ఈ కూర చపాతిల లోకి బావుంటుంది. నీరు ఎక్కువగా లేకుండా చేస్తే చపాతిల మద్యన పెట్టి రోల్ చేసి ఇవ్వచ్చు పిల్లలకి. కొంచం చాట్ మసాలా వేసి ...చాట్ లా తినచ్చు.          
Yummy Food Recipes
Add
Recipe of the Day