Palak Uttapam Recipe By , 2017-10-29 Palak Uttapam Recipe Here is the process for Palak Uttapam making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 15min Ingredients: బియ్యం - 3 కప్పులు,మినప్పప్పు - 1 కప్పు,టమాటా రసం - ఒకటిన్నర కప్పు,పాలక్ పేస్ట్ - 1 కప్పు,ఉల్లిపాయ ముక్కలు - 1/2 కప్పు,క్యాప్సికం ముక్కలు - 1/2 కప్పు,మిరియాల పౌడర్ - 1/4 స్పూన్,చీజ్ - 100 గ్రాములు (సన్నగా తురుము చేసి ఉంచుకోవాలి),ఉప్పు & కారం - రుచికి సరిపడినంత, Instructions: Step 1 ముందురోజు బియ్యం, మినప్పప్పుని విడివిడిగా నానబెట్టి, విడివిడిగా దోసెలపిండిలా రుబ్బుకొని తగినంత ఉప్పు వేసి పిండిని బాగా కలపాలి.  Step 2 మరుసటిరోజు ఉదయం ఊతప్పం వేసుకుంటే, పిండి పులిసి బావుంటుంది.  Step 3 ఇప్పుడు స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి, కొంచెం నూనెవేసి, ఉల్లిపాయముక్కలు వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించి, అందులో టమాటా రసం, పాలక్ పేస్ట్ , ఉప్పు, మిరియాల పౌడర్ అన్నీవేసి బాగా వేయించి (మగ్గించి) పక్కన ఉంచుకోవాలి. Step 4 ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి, పిండిని కొంచెం మందంగా వేసి, అది దోరగా కాలిన తరవాత పాన్ పైనుండి పక్కన ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి.    Step 5 దానిపై  ఉడికించి పక్కన పెట్టుకున్న టమాటా & పాలక్ పేస్ట్ ని వేసి, సన్నగా తరిగి పెట్టుకున్న క్యాప్సికం ముక్కలు & చీజ్ ని పైన పరచి, 450 డిగ్రీల ఫారన్ హీట్ వేడిలో 10 నిముషాలు పాటు ఓవెన్ లో ఉంచి తీసి కొంచెం చల్లబడిన తరవాత తినేయ్యటమే.   Step 6 అంతే చాలా రుచికరమైన, బలమైన .... పిల్లలు ఎంతో ఇష్టపడే పాలక్ ఊతప్పం రెడీ.          
Yummy Food Recipes
Add