vusirikaya curry By , 2017-10-29 vusirikaya curry Here is the process for vusirikaya curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: ఉసిరికాయలు - 4 లేదా 6,ఉల్లిపాయ ముక్కలు - 1/2 కప్పు,టమాటా ముక్కలు - 1/2 కప్పు,పసుపు - 1/4 స్పూన్,ఉప్పు - 1/2 స్పూన్,పచ్చిమిర్చి - 2,కారం - 1 స్పూన్,ధనియాల పొడి - 1 స్పూన్,జీలకర్ర పొడి - 1/2 స్పూన్,నూనె - 3 or 4 స్పూన్స్,,పోపు కొరకు:,జీలకర్ర - 1/4 స్పూన్,ఆవాలు - 1/4 స్పూన్,ఎండుమిర్చి - 1,కరివేపాకు, Instructions: Step 1 ముందుగా ఉసిరి కాయల్ని కడిగి తుడిచి ఉంచుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బాణలిలో 2 స్పూన్స్ నూనె వేసి ఉసిరికాయల్ని వేసి.. దోరగా వేయించుకోవాలి. అవి కొద్దిగా పగలుతాయి.  Step 2 వాటిని వేరే గిన్నెలోకి తీసుకుని మిగతా రెండు చెంచాలు నూనె వేసి పోపు సామాగ్రి వెయ్యాలి.  Step 3 అవి వేగుతుండగా ఉల్లి, పచ్చిమిరపముక్కలు వేసి అన్నీ చక్కని రంగు వచ్చే వరకు వేయించుకుని, టమాటా ముక్కలు కలిపి.. వేయిస్తూ పసుపు కారం వేసి గరిటతో టమాటా ముక్కలు మెత్తగా నొక్కుతూ.. ఒక ముద్ద కూరలా అయ్యేలా ఉడికించుకోవాలి.  Step 4 నీరు కలిపి చక్కని గ్రేవీలా తినే రుచిని బట్టి పలుచగా చేసుకొని ఇప్పుడు ఉసిరికాయల్ని ఉడికే ఆ పులుసుకూర మిశ్రమంలో వేసి.. ధనియాల పొడి, జీలకర్ర పొడి జోడించి మూత పెట్టి దగ్గర పడేదాకా ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.    Step 5 ఈ కూర వేడి అన్నంతో నేతితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఉసిరి ముక్కలకు పులుపు కారం ఉప్పు పట్టి చపాతి, రోటీలలో కూడా చాలా రుచిగా ఉంటుంది.           
Yummy Food Recipes
Add