Baby Potato Yummy Curry By , 2017-10-28 Baby Potato Yummy Curry Baby Potato Yummy Curry , Food, food recipes Prep Time: 10min Cook time: 30min Ingredients: బేబీ పొటాటోలు - 1/4 కేజీ,పచ్చిమిర్చి- 4,ఉల్లిపాయలు- 2(ముద్ద చేసి ఉంచుకోవాలి),టమాట - 1 (ముద్ద చేసి ఉంచుకోవాలి),పసుపు- 1/2 స్పూన్,కారం- 1 స్పూన్,గరం మసాలా- 1/4 స్పూన్,జీలకర్ర- 1 స్పూన్,ఉప్పు- రుచికి తగినంత, Instructions: Step 1 ఈ కర్రీ తయారు చేసుకోటానికి ముందుగా బేబీ పొటాటోస్ ను శుభ్రంగా కడగాలి.  Step 2 తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి అందులో నూనె వేసాకా బేబీ పొటాటోలు వేసి నిధానంగా ఫ్రై చేసుకోవాలి. * ఒక పది నిమిషాలపాటు  గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించుకోవాలి.  Step 3 బేబీ పొటాటో ఫ్రై అయిన తర్వాత నూనె నుండి పొటాటోలను బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. Step 4 అదే పాన్లో మరికొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక అందులో జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి    Step 5 అందులో ఉల్లిపాయ ముద్ద వేసి మరో అయిదు నిముషాలు వేయించాలి.    Step 6 ఉల్లిపాయ పచ్చివాసన పోయాకా అందులో టమోటో పేస్ట్ కూడా వేసి అయిదు నిముషాలు ఫ్రై చేసుకోవాలి. పసుపు,ఉప్పు కూడా వేయాలి.  గ్రేవీ అడుగు అంటకుండా మెల్లిగా కదుపుతూ ఉండాలి. అందులోనే కారం, ధనియాల పొడి,గరం మసాలా వేయాలి.    Step 7 ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకొన్న బేబీ పొటాటోలను కూడా వేసి కలిపి మరో రెండు నిమిషాలు మగ్గనివ్వాలి.    Step 8 ఇలా తయారయిన కర్రీ ని బౌల్ లోకి తీసి కొత్తిమీరతో అలంకరించుకుంటే చూడటానికి అందంగా మాత్రమే కాదు చపాతిలతో గాని అన్నంతో గాని తినటానికి ఎంతో  రుచిగా కూడా  ఉంటుంది.           
Yummy Food Recipes
Add
Recipe of the Day