menthi pulusu By , 2014-08-01 menthi pulusu menthi pulusu - itsa healthy dish good for digestion, tasty and easy preparation menthi pulusu .... Prep Time: 15min Cook time: 35min Ingredients: తగినంత ఉప్పు, చిటికెడు ఇంగువ, 1 టేబుల్ స్పూన్ నూనె, చిన్నముక్క బెల్లం, 2 రెమ్మలు కర్వేపాకు, 4 ఎండుమిర్చి, 4 పచ్చిమిర్చి, 2 టీస్పూన్లు పెసరపప్పు, 2 టీస్పూన్లు శనగపప్పు, 2 టీస్పూన్లు మినప్పప్పు, 2 టీస్పూన్లు ఆవాలు, 2 టీస్పూన్లు జీలకర్ర, 2 టీస్పూన్లు మెంతులు, 100 గ్రా చింతపండు, Instructions: Step 1 చింతపండును నానబెట్టి చిక్కగా పులుసు తీసి పక్కన ఉంచాలి. Step 2 బాణలిలో నూనె వేసి ఒక స్పూను ఆవాలు, ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూను మెంతులు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి పోపు పెట్టాలి. ఇవన్నీ వేగిన తర్వాత చింతపండు పులుసు పోసి ఉప్పు వేయాలి. Step 3 పులుసు ఉడుకుతుండగా మరొక బాణలిలో నూనె వేయకుండా శనగపప్పు, మినప్పప్పు, పెసరపప్పులను వేయించాలి. ఈ పప్పులు చల్లారేలోపు అదే బాణలిలో మెంతులు, ఆవాలు, జీలకర్ర వేయించాలి. చల్లారిన తర్వాత పప్పులను, పోపు దినుసులను విడిగా పొడి చేసుకోవాలి. Step 4 మరుగుతున్న పులుసులో బెల్లం వేసి, తర్వాత పోపు దినుసుల పొడి వేయాలి. ఆ తర్వాత పప్పుల పొడిని నీటిలో కలిపి (ఉండలు కట్టకుండా ఉండడానికి) పులుసులో పోసి ఐదు నిమిషాల సేపు ఉడికించి దించాలి.
Yummy Food Recipes
Add