bendakaya tomato chutney recipe By , 2017-10-07 bendakaya tomato chutney recipe Here is the process for bendakaya tomato chutney making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 15min Ingredients: బెండకాయ ముక్కలు - కప్పు,,టొమాటో ముక్కలు - కప్పు,,చింతపండు - కొద్దిగా,,ధనియాలు - టీ స్పూను,,శనగపప్పు - రెండు టీ స్పూన్లు,,మెంతులు - కొద్దిగా,,మినప్పప్పు - టీ స్పూను,,ఎండుమిర్చి - 8,,ఆవాలు - అర టీ స్పూను,,జీలకర్ర - అర టీ స్పూను,కరివేపాకు - రెండు రెమ్మలు,,ఇంగువ - చిటికెడు,నూనె - నాలుగు టీ స్పూన్లు,,పసుపు - చిటికెడు,ఉప్పు - తగినంత, Instructions: Step 1 బాణలిలో చెంచాడు నూనె వేసి ధనియాలు, శనగపప్పు, మినప్పప్పు, మెంతులు వేసి కొద్దిగా వేగాక, ఎండుమిర్చి కూడా వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి.  Step 2 అదే బాణలిలో మరో రెండు స్పూన్ల నూనె వేసి తరిగిన బెండకాయ ముక్కలు, టొమాటో ముక్కలు, పసుపు వేసి రెండు నిముషాలు వేయించి మూత పెట్టి ఉడికించాలి. Step 3 వేయించిన ధనియాలను మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకొని, దానిలో నానబెట్టిన చింతపండు, ఉప్పు, ఉడికించి చల్లార్చిన బెండ, టొమాటో మిశ్రమం వేసి మరోసారి మిక్సీ వేయాలి. మరీ మెత్తగా కాకూడదు. Step 4 బాణలిలో నూనె కాగాక, పోపుదినుసులు వేయించాలి.    Step 5 చిటపటలాడాక కరి వేపాకు, ఇంగువ, ఎండుమిర్చి వేసి వేయించి ఈ పోపును పచ్చడిలో కలపాలి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day