kashmiri pulav recipe By , 2017-10-05 kashmiri pulav recipe Here is the process for kashmiri pulav making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: బాస్మతి రైస్- 500 గ్రా,ఉల్లిపాయ ముక్కలు- 100గ్రా,దాల్చిన చెక్క - 5 గ్రా,ఏలకులు - 5 గ్రా,లవంగాలు - 5 గ్రా,జీలకర్ర - అర స్పూన్,బిర్యానీ ఆకు- ఒకటి,కుంకుమ పువ్వు - గ్రాము,పాలు - 10 మి.లీ,వాల్‌నట్ - 20 గ్రా,జీడిపప్పు- 20 గ్రా,కిస్‌మిస్ - 20 గ్రా,ఆపిల్ ముక్కలు - 50 గ్రా,పియర్ ముక్కలు- 50 గ్రా,నీరు- లీటరు,నెయ్యి- 50 గ్రా,ఉప్పు- తగినంత,తరిగిన కొత్తిమీర- కప్పు, Instructions: Step 1 బియ్యం కడిగి నీటిని పూర్తిగా వంపేయాలి. మందపాటి పాత్రలో నేతిని వేడి చేసి కిస్‌మిస్, వాల్‌నట్, జీడిపప్పులను వేయించి విడిగా తీసుకోవాలి.  Step 2 మిగిలిన నేతిలో ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఏలకులు, లవంగాలు వేసి వేయించాలి. Step 3 అవి వేగిన తర్వాత కడిగిన బియ్యాన్ని వేసి రెండు నిమిషాల పాటు సన్నమంట మీద వేయించాలి.  Step 4 ఇప్పుడు పాలు, కుంకుమ పువ్వు, నీరు, ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి. నీరు మరగడం మొదలైన తర్వాత మంట తగ్గించి నీరంతా ఇంకేదాకా ఉంచి దించేయాలి. (బియ్యం, నీరు పై కొలతలను పాటిస్తే అన్నం అతుక్కోకుండా విడివిడిగా వస్తుంది).    Step 5 తర్వాత కొత్తిమీర, పండ్ల ముక్కలు, వేయించిన కిస్‌మిస్, వాల్‌నట్, జీడిపప్పులతో గార్నిష్ చేయాలి.    Step 6 గార్నిష్ చేసిన తరవాత మూత పెడితే కొంత సేపటికి వాటి సువాసన రైస్‌కు పట్టి, రుచి ఇనుమడిస్తుంది.              
Yummy Food Recipes
Add