mughlai biryani badshahi By , 2017-10-05 mughlai biryani badshahi Here is the process for mughlai biryani badshahi making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: మటన్ - అర కేజీ;,బాస్మతి బియ్యం - పావు కేజీ;,నిమ్మరసం - 3 టేబుల్ స్పూన్లు;,బాదం పప్పుల తరుగు - 2 టేబుల్ స్పూన్లు;,పుదీనా ఆకులు - 10;,బటర్ - కప్పు;,కొత్తిమీర - కొద్దిగా;,జీలకర్ర - అర టేబుల్ స్పూను;,ఉల్లి తరుగు - అర కప్పు;,ఏలకులు - 2;,నూనె - టేబుల్ స్పూను;,వెల్లుల్లి రేకలు - 2;,అల్లం ముక్క - చిన్నది;,కుంకుమ పువ్వు - అర టేబుల్ స్పూను;,పచ్చి మిర్చి తరుగు - అర టేబుల్ స్పూను;,కారం - అర టేబుల్ స్పూను;,దాల్చిన చెక్క - చిన్న ముక్క;,పెరుగు - అర కేజీ;,పాలు - 125 మి.లీ;,నీళ్లు - 3 కప్పులు, Instructions: Step 1 బియ్యం కడిగి నానబెట్టాలి. బాణలిలో నూనె వేసి కాగాక ఉల్లి తరుగు వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాలి.  Step 2 కొద్దిగా నీళ్లలో కుంకుమ పువ్వు వేసి కలపాలి. అల్లం, ఎండు మిర్చి, వెల్లుల్లి, బాదంపప్పులను మిక్సీలో వేసి ముద్ద చేయాలి. Step 3 బాణలిలో బటర్ వేసి కరిగాక తయారుచేసి ఉంచుకున్న ఈ ముద్ద వేసి వేయించాలి . Step 4 మటన్, ఉప్పు జత చేసి బాగా కలిపి ఐదు నిమిషాలు ఉంచాలి.నీళ్లు పోసి బాగా ఉడికించాలి. (సుమారు ఒక కప్పు గ్రేవీ ఉండేవరకు ఉడికించాలి).    Step 5 ఒక పెద్ద పాత్రలో నీళ్లలో ఉప్పు, బియ్యం వేసి ఉడికించాలి.   Step 6 పెరుగును ఒక వస్త్రంలో గట్టిగా కట్టి ఉన్న నీరంతా పోయేలా పిండేయాలి.   Step 7 లవంగాలు, ఏలకులు, జీలకర్ర, పుదీనా, పచ్చి మిర్చి తరుగు, కొత్తిమీర పెరుగులో వేసి కలపాలి.   Step 8 కుంకుమ పువ్వు నీరు, నిమ్మరసం రెండింటినీ మటన్‌లో వేసి కలపాలి.   Step 9 సగం అన్నాన్ని మటన్ మీద వేసి, వేయించి ఉంచుకున్న ఉల్లి తరుగు వేసి మళ్లీ పైన అన్నం వేయాలి.    Step 10 పాలు, కొద్దిగా పెరుగు వేసి మూత ఉంచాలి . సుమారు గంటసేపు స్టౌ మీద ఉంచి దించేయాలి. వేడివేడిగా వడ్డించాలి.  
Yummy Food Recipes
Add