chukkakura potato biryani recipe By , 2017-09-27 chukkakura potato biryani recipe Here is the process for chukkakura potato biryani making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: బియ్యం - ఒక కిలో,,చుక్కకూర - రెండు కట్టలు,,బంగాళదుంపలు - పావుకిలో,,అల్లం వెలుల్లిపేస్ట్ - మూడు టీ స్పూన్లు,,ఉల్లిపాయ - ఒకటి (పెద్దది),,పచ్చిమిర్చి - 6 (సన్నగా తరిగినవి),,నూనె - 100 గ్రా.,,నెయ్యి- రెండు టీ స్పూన్లు,,లవంగాలు - నాలుగు,,దాల్చినచెక్క - చిన్న ముక్కలు రెండు,,ఉప్పు - తగినంత, Instructions: Step 1 ముందుగా బియ్యాన్ని కడిగి పక్కన పెట్టుకోవాలి. చుక్కకూరను శుభ్రంచేసి గ్రైండ్ చేయాలి.  Step 2 అన్నం వండడానికి ఉపయోగించే అడుగుమందంగా ఉన్న పాత్రను కాని, ప్రెషర్ పాన్‌ను కాని స్టవ్‌పై ఉంచి వేడెక్కిన తరువాత నూనె, నెయ్యి వేయాలి.  Step 3 అవి వేడెక్కిన తరువాత లవంగాలు, దాల్చినచెక్క వేసి వేగనివ్వాలి. ఇప్పుడు అల్లంవెల్లుల్లి పేస్టు వేసి వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, సన్నగా తరిగిన బంగాళదుంప ముక్కలు వేసి సన్న మంట మీద రెండు నిమిషాల సేపు మగ్గనివ్వాలి.  Step 4 ఇప్పుడు చుక్కకూర పేస్ట్ వేసి దోరగా వేగిన తరువాత తగినంత నీటిని పోసి ఉప్పు వేయాలి.    Step 5 నీళ్ళు మరిగిన తరువాత బియ్యం వేసి ఉడకనివ్వాలి. అంతే - చుక్కకూర - ఆలూ బిర్యానీ రె డీ.          
Yummy Food Recipes
Add
Recipe of the Day