hyderabadi fish biryani recipe By , 2017-09-26 hyderabadi fish biryani recipe Here is the process for hyderabadi fish biryani making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: పెరుగు - 50 గ్రా;,నిమ్మకాయ - ఒకటి,నిమ్మరసం - రెండు టీ స్పూన్లు;,ఉల్లిపాయ తరుగు - కప్పు (వేయించినది);,నూనె - పావు కప్పు,కొత్తిమీర తరుగు - కట్ట;,పుదీనా తరుగు - కట్ట;,పచ్చిమిర్చి - 10 (నిలువుగా చీరాలి),గరం మసాలా - టీ స్పూన్;,కారం - టీ స్పూన్,,పసుపు - అర టీ స్పూన్,,బాస్మతీ రైస్ - 200 గ్రా,కెవ్రా వాటర్ - టీ స్పూన్ (మార్కెట్‌లో దొరుకుతుంది),,నెయ్యి - రెండు టీ స్పూన్లు;,డాల్డా - రెండు టీ స్పూన్లు,,బిర్యానీ ఆకు - రెండు;,జాజికాయ పొడి - అర టీ స్పూన్,ఏలుకల పొడి - అర టీ స్పూన్;,దాల్చిన చెక్క - చిన్న ముక్క;,లవంగాలు - నాలుగు,రోజ్ వాటర్ - టీ స్పూన్;,అల్లం తరుము - రెండు టీ స్పూన్లు;,కుంకుమ పువ్వు - చిటికెడు, Instructions: Step 1 చేప ముక్కలను శుభ్రంగా కడగాలి. ఒక గిన్నెలో చేప ముక్కలు, పెరుగు, నిమ్మరసం, పసుపు, కారం, గరం మసాలా వేసి అన్నిటినీ కలిపి పక్కన పెట్టుకోవాలి.  Step 2 ఈలోగా బియ్యం కడిగి 30 నిమిషాలపాటు నాననివ్వాలి. బియ్యంలో తగినంత ఉప్పు వేసి పొడిపొడిగా ఉడికించి పక్కన పెట్టాలి.  Step 3 ఇప్పుడు పాన్‌లో నూనె వేసి వేడెక్కాక అందులో ఏలకుల పొడి, లవంగాలు, దాల్చిన చెక్క, జాజికాయ పొడి, బిర్యాని ఆకులు, కరివేపాకు, పుదీనా, పచ్చిమిర్చి వేసి అన్నిటినీ దోరగా వేయించాలి. Step 4 అందులో కప్పు నీళ్లు పోసి నానబెట్టిన చేప ముక్కలు, కాస్త ఉప్పు వేసి తక్కువ సెగ మీద మూత పెట్టి ఉడికించాలి.   Step 5 ఈ మిశ్రమం చిక్కబడ్డాక కుక్కర్‌లో ఉడికిన అన్నం కొంచం, చేప మిశ్రమం కొంచం, డాల్డా, నెయ్యి, కుంకుమపువ్వు, రోజ్ వాటర్, కెవ్రా వాటర్ కొంచెం కొంచెం చొప్పున అన్నిటినీ లేయర్స్‌గా వేసి మూతపెట్టి తిరిగి అయిదారు నిమిషాలు ఉడికించాలి.    Step 6 తినబోయే ముందు సర్వింగ్ బౌల్‌లో బిర్యానీని తీసుకుని వేయించిన ఉల్లిపాయ తరుగు, కొత్తిమీర, నిమ్మచెక్కలతో గార్నిష్ చేయాలి. ఎంతో రుచికరమైన హైదరాబాది ఫిష్ బిర్యానీ రెడీ.          
Yummy Food Recipes
Add