ragandi pulusu recipe By , 2017-09-25 ragandi pulusu recipe Here is the process for ragandi pulusu making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: రాగండి చేపలు - కేజీ,ఉల్లిపాయలు - 2 పెద్దవి,పచ్చిమిర్చి - 5 (మధ్యకు చీల్చుకోవాలి),అల్లంవెల్లుల్లి పేస్టు - 1 టేబుల్‌ స్పూన్‌,కారం -2 టేబుల్‌ స్పూన్లు,పసుపు - చిటికెడు,ఉప్పు - తగినంత,నూనె - తగినంత,కొత్తిమీర తురుము - 2 టేబుల్‌ స్పూన్లు,చింతపండు గుజ్జు - 1 కప్పు, Instructions: Step 1 రాగండి చేపల్ని శుభ్రం చేసుకుని ముక్కలు చేసుకోవాలి. పొయ్యి మీద చేపలగిన్నె పెట్టుకుని నూనె పోయాలి.  Step 2 నూనె వేడెక్కాక ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత పసుపు, ఉప్పు, కారం, అల్లంవెల్లుల్లి పేస్టు వేసి వేపాలి.  Step 3 అందులోనే చేప ముక్కల్ని వేసి ఉప్పు, కారం బాగా పట్టేలా కలపాలి. సన్న సెగమీద కాసేపు ఉడకనివ్వాలి.  Step 4 ఆ తర్వాత చింతపండు పులుసు పోసి చేప ముక్కలు చితకకుండా కలపాలి.    Step 5 మూతపెట్టి సన్న సెగమీద పులుసు చిక్కగా అయ్యేంతవరకు ఉడకనివ్వాలి.    Step 6 ఆఖరులో ధనియాలు, జీలకర్ర పొడి వేసి గిన్నె కదపాలి.    Step 7 ఆ తర్వాత కొత్తిమీర తురుము చల్లుకుని కొద్దిసేపు ఉంచి దించేయాలి. అంతే రాగండి చేపల పులుసు రెడీ.              
Yummy Food Recipes
Add