aloo dum curry By , 2017-12-28 aloo dum curry Here is the process for aloo dum curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: సాధారణ సైజు బంగాళాదుంపలు: ఎనిమిది,,టమోటాలు: నాలుగు(పండినవి),,కారం పొడి: రెండు టేబుల్‌ స్పూన్లు,,అల్లం వెల్లుల్లి ముద్ద: అర టేబుల్‌స్పూను,,ఉలిపాయ ముద్ద: అర కప్పు,,కొత్తిమీర ఆకులు: టేబుల్‌ స్పూను,,మెంతులు: కొన్ని,,ఉప్పు: రుచికి సరిపడ,,నూనె: తగినంత, Instructions: Step 1 ముందుగా బంగాళాదుంపలను ఉడికించి కావలసిన సైజులో ముక్కలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బాండీలో నూనె పోసి కాగిన తరువాత మెంతులు వేసి కొద్దిసేపు వేగనివ్వాలి. Step 2 అనంతరం ఉల్లిపాయ ముద్ద వేసి దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద, టమోటా ముక్కలు వేసి సన్నని మంట మీద బాగా వేయించుకోవాలి. Step 3 తరువాత కారం, ఉప్పు వేసి బాగా ఉడకనివ్వాలి. అవసరం అనుకుంటే కొద్దిగా నీరు పోసుకోవచ్చు. మసాలా అంతా ఉడికి నూనె పైకి తేలుతున్నప్పుడు బంగాళాదుంప ముక్కలు వేసుకొని ఒకటి రెండు నిమిషాలు ఉడికించి, దింపే ముందు కొత్తిమీర ఆకులు వేసుకోవాలి.                    
Yummy Food Recipes
Add
Recipe of the Day