prawns manchurian recipe By , 2017-09-19 prawns manchurian recipe Here is the process for prawns manchurian making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: ప్రాన్స్ - 200 గ్రా;,అజినమోటో - టీ స్పూన్,ఉప్పు - తగినంత;,మిరియాల పొడి - రెండు టీ స్పూన్లు,కోడిగుడ్డు - ఒకటి;,కార్న్‌ఫ్లోర్ - అర కప్పు;,మైదాపిండి - పావు కప్పు,నూనె - డీప్ ఫ్రైకి సరిపడా;,పచ్చిమిర్చి తరుగు - రెండు టీ స్పూన్లు,అల్లంవెల్లుల్లి తరుగు -నాలుగు టీ స్పూన్లు;,పసుపు - చిటికెడు,కారం - టీ స్పూన్;,కొత్తిమీర - కట్ట (సన్నగా తరగాలి), Instructions: Step 1 ముందుగా ప్రాన్స్‌ని శుభ్రంగా కడిగి వేడినీటిలో ఒక మోస్తరుగా ఉడికించి పక్కనపెట్టుకోవాలి.  Step 2 ఒక గిన్నెలో అర టీ స్పూన్ అజినమోటో, ఉప్పు, అర టీ స్పూన్ మిరియాల పొడి, కోడిగుడ్డుసొన, కార్న్‌ఫ్లోర్, మైదాపిండి వేసి తగినంత నీటితో గరిటజారుగాకలుపుకోవాలి.  Step 3 ఆ మిశ్రమంలో ఉడికించిన ప్రాన్స్ వేసి కలపాలి.  Step 4 పాన్‌లో నూనె పోసి వేడయ్యాక కలిపిపెట్టుకున్న రొయ్యల మిశ్రమాన్ని పకోడీల్లా వేసుకుని వేయించి పక్కన పెట్టుకోవాలి.    Step 5 ఇప్పుడు వేరొక పాన్ పెట్టుకుని పావు కప్పు నూనె వేసి వేడయ్యాక అందులో పచ్చిమిర్చి తరుగు, అల్లంవెల్లుల్లి తరుగు, అర టీ స్పూన్ అజినమోటో, అర టీ స్పూన్ మిరియాలపొడి, ఉప్పు, పసుపు, కారం వేసి దోరగా వేయించాలి.    Step 6 ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న ప్రాన్స్ పకోడీని కూడా కలిపి తక్కువ సెగ మీద అయిదారు నిమిషాలు తిప్పి సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేస్తే ప్రాన్స్ మంచూరియా రెడీ...          
Yummy Food Recipes
Add
Recipe of the Day