gongura prawn curry recipe By , 2017-09-19 gongura prawn curry recipe Here is the process for gongura prawn curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: గోంగూర - కప్పు,,రొయ్యలు - పావుకప్పు,,నెయ్యి - నాలుగు చెంచాలు,,టమాటాలు - మూడు,,అల్లంవెల్లుల్లి పేస్ట్ - చెంచా,,ఉల్లిపాయలు - రెండు,,పచ్చిమిర్చి, ఎండుమిర్చి - నాలుగు,,తాలింపుదినుసులు - అన్నీ కలిపి కొద్దిగా,,ధనియాలపొడి - అరచెంచా,,పసుపు - అరచెంచా,,కారం - రెండు చెంచాలు,,ఉప్పు - రుచికి తగినంత,,కరివేపాకు, కొత్తిమీర - గార్నిషింగ్ కోసం., Instructions: Step 1 గోంగూరను బాగా కడిగి ఉడికించి పెట్టుకోవాలి. పాన్‌లో నెయ్యి, శుభ్రం చేసిన రొయ్యల్ని వేసి బాగా వేయించాలి.  Step 2 ఈ వేయించిన రొయ్యల్ని నెయ్యి లేకుండా విడిగా తీసిపెట్టుకోవాలి.  Step 3 ఈ మిగిలిన నెయ్యిలో ఎండుమిర్చి, తాలింపుదినుసులు ఉల్లిపాయముక్కలు, కరివేపాకు పచ్చిమిర్చి వేసి వేయించాలి.  Step 4 అవి వేగాక అల్లం వెల్లుల్లి మిశ్రమం ఆ తరువాత టమాటా ముక్కలు చేర్చాలి.    Step 5 ఆ తరువాత ఉడికించి పెట్టుకున్న గోంగూర, కాస్త పసుపు, ఉప్పు, కారం వేసి మూతపెట్టాలి.    Step 6 మరికాసేపయ్యాక ధనియాలపొడి, వేయించిన రొయ్యల్ని చేర్చాలి.    Step 7 ఐదారునిమిషాలయ్యాక కొత్తిమీర చల్లి దింపేస్తే సరిపోతుంది.   Step 8 అంతే ఎంతో రుచికరమైన గోంగూర రొయ్యల కూర సిద్ధం అయినట్టే.          
Yummy Food Recipes
Add
Recipe of the Day