garlic curry recipe By , 2017-09-07 garlic curry recipe Here is the process for garlic curry making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: వెల్లుల్లి రెబ్బలు - 200 గ్రా.,చింతపండు - 75 గ్రా.; నూనె - 3 టేబుల్ స్పూన్లు,మెంతులు - టీ స్పూన్; సోంపు - అర టీ స్పూన్,కరివేపాకు - రెమ్మ; ఉల్లిపాయలు - 3,పచ్చిమిర్చి - 3 (నిలువుగా కట్ చేయాలి),కారం - అర టీ స్పూన్; పసుపు - అర టీ స్పూన్,టొమాటో - 2 (సన్నగా తరగాలి), Instructions: Step 1 చింతపండులో వేడినీళ్లు పోసి, అరగంట నానబెట్టాలి. గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి.  Step 2 స్టౌ మీద గిన్నె పెట్టి, టేబుల్ స్పూన్ నూనె వేసి వేడయ్యాక 50 గ్రా.ల వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి.  Step 3 అందులోనే అర టీ స్పూన్ మెంతులు, ఎండుమిర్చి వేసి వేయించి, దించాలి.  Step 4 చల్లారిన తర్వాత పేస్ట్ చేయాలి. అదే గిన్నెలో మిగతా నూనె వేసి, సోంపు, మెంతులు వేయించాలి.    Step 5 ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి మరో ఐదు నిమిషాలు వేయించి, పసుపు, కారం, తరిగిన టొమాటోలు కలిపి ఉడికించాలి.   Step 6 వెల్లుల్లి రెబ్బలు, వెల్లుల్లి పేస్ట్ వేసి, వేయించాక చింతపండు గుజ్జు, తగినన్ని నీళ్లు పోసి సన్నని మంట మీద 15 నిమిషాలు ఉడికించాలి. వెల్లుల్లి బాగా ఉడికి, మిశ్రమం చిక్కబడినాక మంట తీసేయాలి. కొత్తిమీర చల్లి, సర్వ్ చేయాలి. ఈ కర్రీ చపాతీ, పూరీలోకి బాగుంటుంది.          
Yummy Food Recipes
Add