kophta malai curry recipe By , 2017-09-05 kophta malai curry recipe Here is the process for kophta malai curry making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: పెరుగు మీద మీగడ : 100 గ్రా.,క్యారెట్‌ : 100 గ్రా.,ఆనపకాయ : 200 గ్రా.,బంగాళాదుంపలు : 100 గ్రా.,శనగపిండి : 50 గ్రా.,పచ్చిమిరపకాయలు : 20 గ్రా.,కొత్తిమీర : రెండు కట్టలు,నిమ్మకాయ : సగం చెక్క,రిఫైన్డ్‌ ఆయిల్‌ : వేయించడానికి సరిపడా,ఉప్పు : తగినంత,,గ్రేవీ కోసం...,జీడిపప్పు : 25 గ్రా.,గసగసాలు : 25 గ్రా.,కారంపొడి : ఒక టీ స్పూన్‌,పెరుగు : 1/2 టీ స్పూను,క్రీమ్‌ : 50 మి.లీ.,అల్లం వెల్లుల్లి : ఒక టీస్పూన్‌,ఉల్లిపాయలు : 100 గ్రా.,గరం మసాలా : చిటెకెడు, Instructions: Step 1 క్యారెట్‌, ఆనపకాయల చెక్కుతీసి తురిమి పెట్టుకోవాలి. ఆనపకాయ నుంచి నీళ్ళు పూర్తిగా పిండేయాలి. Step 2 ఉడక బెట్టిన బంగాళాదుంపలను కూడా తురిమి ఉంచుకోవాలి.  Step 3 ఇప్పుడు ఒక గిన్నెలో కొంచెం నూనె తీసుకొని దానిలో పచ్చి మిరపకాయలు వేయించి అందులో శనగపిండి కూడా దోరగా వేయించి ఆ తర్వా త తురిమి పెట్టుకున్న క్యారెట్‌, ఆనపకాయల ను వేసి బాగా కలిపి స్టౌమీద నుంచి కిందకు దింపేయండి. Step 4 దానిలో తురిమిన బంగాళా దుంపలు, పెరుగుమీగడ, కొత్తిమీర, నిమ్మకాయ, తగినంత చేర్చి, పిరమిడ్లలాంటి కోఫ్తాలుగా చేయండి.    Step 5 ఆ తర్వాత వీటిని కార్న్‌ఫ్లోర్‌లో దొర్లించి, కాగిన నూనెలో దోరగా వేయించి, ఒక డిష్‌లో అమర్చండి. వీటిమీద తయారుచేసి ఉంచుకున్న గ్రేవిని పోసి పైన కొత్తిమీర, క్రీమ్‌తో వడ్డించండి.   Step 6 గ్రేవీకోసం : జీడిపప్పు, గసగసాలు మెత్తగా రుబ్బి పక్కన ఉంచుకోండి   Step 7 ఒక గిన్నెలో వందగ్రాముల నూనెపోసి, సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేయించి, అందులో అల్లం వెల్లుల్లి ముద్ద, కారంపొడి, వేశాక నూరిన మసాలను కలిపి నూనె తేలేవరకూ ఫ్రై చేయండి.    Step 8 అందులో పెరుగు, గరం మసాలా, తగినన్ని నీళ్ళు పోసి మరగనివ్వాలి.          
Yummy Food Recipes
Add