palak kuttu recipe By , 2017-08-31 palak kuttu recipe Here is the process for palak kuttu making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: పాలకూర - 2 కట్టలు,కందిపప్పు - 100 గ్రా.,పెసరపప్పు - 100 గ్రా.,పల్లీలు - 50 గ్రా.,ఎండుమిర్చి - 6,శనగపప్పు - రెండు టీ స్పూన్లు,మినప్పప్పు - టీ స్పూను,ధనియాలు - టీ స్పూను,పసుపు - చిటికెడు,నీరు - తగినంత,ఎండుకొబ్బరిపొడి - రెండు టీ స్పూన్లు,తెల్లనువ్వులు - రెండు టీ స్పూన్లు,పాలు - అరగ్లాసు,పంచదార - టీ స్పూను,మిరియాలు - 10,జీలకర్ర - టీ స్పూను,పోపు కోసం:-,నూనె లేదా నెయ్యి, ఎండుమిర్చి, ఆవాలు, ఇంగువ, కరివేపాకు - రెండు రెమ్మలు, కొత్తిమీర - ఒక కట్ట, Instructions: Step 1 బాణలిలో నూనె లేకుండా శనగపప్పు, ధనియాలు, మినప్పప్పు, ఎండుకొబ్బరి తురుము, ఎండుమిర్చి, నువ్వులను దోరగా వేయించి పక్కనుంచుకోవాలి.  Step 2 చల్లారిన తరవాత అందులో మిరియాలు, జీలకర్ర, ఇంగువ వేసి గ్రైండర్‌లో మెత్తగా చేసి పక్కనుంచుకోవాలి.  Step 3 కుకర్ లో కందిపప్పు, పెసరపప్పు, పాలకూర తరుగు, పల్లీలు, పసుపు, తగినంత నీరు పోసి నాలుగు విజిల్స్ వచ్చేవరకు ఉంచి దింపేయాలి.  Step 4 చల్లారాక అందులో పొడి చేసి ఉంచుకున్న మిశ్రమాన్ని వేసి రెండు పొంగులు రానిచ్చాక పాలు, పంచదార, ఉప్పు వేసి బాగా కలిపి దింపేయాలి.    Step 5 బాణలిలో నూనె వేడయ్యాక పోపు సామాను గోధుమరంగు వచ్చేవరకు వేయించి దానిని కూటులో వేసి బాగా కలిపి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. పాలకూర కూటు ఇడ్లీ, దోసె, చపాతీ, అన్నంలోకి బావుంటుంది.                  
Yummy Food Recipes
Add