coconut dal By , 2014-07-25 coconut dal coconut dal - its complete healthy recipe, very yummi tast, easty preparation coconut dal..... Prep Time: 15min Cook time: 35min Ingredients: తగినంత ఉప్పు, 3 టేబుల్ స్పూన్ ధనియాలపొడి, 2 టీస్పూన్ నిమ్మరసం, 1 బీరకాయ, 4 టమాటాలు, 400 మి. లీ కొబ్బరిపాలు, 400 మి.లీ వేజిటేబుల్ స్టాక్, 1 టీస్పూన్ పసుపు, 2 టీస్పూన్ జీలకర్రపొడి, చిన్నముక్క అల్లం, 4 రెబ్బలు వెల్లుల్లి, 4 వెల్లుల్లి, 1 ఉల్లిపాయ, 2 టేబుల్ స్పూన్ పల్లీనూనె, 2 టేబుల్ స్పూన్ ఎర్రపప్పు, Instructions: Step 1 ముందుగా ఎర్ర పప్పు కడిగి నానపెట్టుకోవాలి. Step 2 పాన్ లో ఎర్రపప్పు వేసి అందులో ఉల్లిపాయముక్కలు, లవంగాలు వేసి వేయించుకోవాలి. Step 3 అందులో అల్లం వెల్లుల్లిపేస్ట్, జీలకర్ర, పసుపు వేసి మరికాసేపు వేగనివ్వాలి. Step 4 వేగుతున్న మిశ్రమంలో ముందుగా నానపెట్టుకున్న ఎర్రపప్పు వేసి 1 నిమిషంపాటు వేయించుకోవాలి. Step 5 తర్వాత అందలో కోకోనట్ మిల్క్, వెజిటేబుల్ స్టాక్ కూడా వేసి, బాగా మిక్స్ చేయాలి. అలాగే కొద్దిగా నీళ్ళు కూడా వేసి బాగా కలిపి ఉడికించుకోవాలి. Step 6 అందులో టమాటో ముక్కలు కూడా వేసి, ఉడికించుకోవాలి. అలాగే కొద్దిగా నిమ్మరసం కూడా మిక్స్ చేసి, మరో 5నిముషాలు ఉడికించుకోవాలి. Step 7 తర్వాత అందులో బీరకాయ ముక్కలు కూడా వేసి, మెత్తగా ఉడకించుకోవాలి. ఇప్పుడు పప్పు, బీరకాయ ముక్కలు మెత్తగా ఉడికి, కర్రీ చిక్కబడే సమయం చూసి, స్టవ్ ఆఫ్ చేయాలి. చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి, క్రిందికి దింపుకొని సర్వ్ చేయాలి. అంతే క్రీమీ కోకనట్ దాల్ రిసిపి చాలా రుచికరంగా ఉంటుంది.
Yummy Food Recipes
Add