khova carrot delight recipe By , 2017-07-31 khova carrot delight recipe Here is the process for khova carrot delight making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: కావలసినవి...క్యారెట్‌ ముక్కలు (సన్నగా తరిగినవి) - మూడు కప్పులు,క్యారెట్‌ తురుము - అరకప్పు,కోవా - 100 గ్రా,పంచదార - రెండు కప్పులు,పాలు - 100 గ్రా,నెయ్యి - అరకప్పు,పచ్చి కొబ్బరి తురుము - ఒక కప్పు,జీడిపప్పు - పది పలుకులు,చెర్రీస్‌ - పది,యాలకుల పొడి - అర టీ స్పూన్‌,కుంకుమ పువ్వు - చిటికెడు, Instructions: Step 1 క్యారెట్‌ తురుము, క్యారెట్‌ ముక్కలకు కొద్దికొద్దిగా పాలు జతచేస్తూ విడివిడిగా ఉడికించుకోవాలి.  Step 2 ఉడికిన క్యారెట్‌ ముక్కలను మాత్రమే గ్రైండ్‌ చేసుకోవాలి. ఒక పాత్రలో నెయ్యి వేసి జీడిపప్పును వేయించి పక్కన పెట్టుకోవాలి.  Step 3 తరువాత ఉడికిన క్యారెట్‌ తురుముని, గ్రైండ్‌ చేసుకున్న మిశ్రమాన్ని వేసి ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి.  Step 4 తరువాత పంచదార కలిపి అడుగంటకుండా కలియబెడు తూ ఉండాలి. ఈలోపు కోవా, పచ్చి కొబ్బరిని గ్రైండ్‌ చేసుకొని అందులో వేసి కలుపుకోవాలి.  Step 5 మిగిలిన పాలు వేసి కొద్దిసేపు ఉడికించుకోవాలి. చివరగా యాలకుల పొడి, జీడిపప్పు, కుంకుమ పువ్వుతో గార్నిష్‌ చేసుకోవాలి. అంతే... కోవా క్యారెట్‌ డిలైట్‌ రెడీ.  
Yummy Food Recipes
Add
Recipe of the Day