pongadalu By , 2017-12-23 pongadalu Here is the process for pongadalu making .Just follow this simple tips Prep Time: 4hour 20min Cook time: 25min Ingredients: ఇడ్లీ బియ్యం: అరకప్పు,,ముడిబియ్యం లేదా అటుకులు: అరకప్పు,,మినప్పప్పు: పావు కప్పు,,మెంతులు: అర టీస్పూను,,ఉప్పు: రుచికి సరిపడా,,,తాలింపుకోసం: ,ఉల్లిపాయలు: రెండు,,పచ్చిమిర్చి: నాలుగు,,కరివేపాకు: రెబ్బ,,కొబ్బరి తురుము: 2 టేబుల్‌స్పూన్లు,,మినప్పప్పు: టేబుల్‌స్పూను,,సెనగపప్పు: టేబుల్‌స్పూను,,ఆవాలు: టీస్పూను,,నూనె: టేబుల్‌స్పూను., Instructions: Step 1 బియ్యం, మినప్పప్పు, మెంతులు అన్నీ కడిగి విడివిడిగా గిన్నెల్లో పోసి సుమారు నాలుగు గంటలపాటు నానబెట్టాలి. తరవాత అన్నీ కలిపి మెత్తగా రుబ్బి, ఉప్పు కలపాలి.  Step 2 ఈ పిండిని కనీసం ఓ పది గంటలు పులియనివ్వాలి. అది రెండింతలు అయ్యాక వేస్తే పనియారం లేదా పొంగడాలు బాగా వస్తాయి. వీటిని ఇడ్లీ లేదా దోసెపిండితోకూడా వేసుకోవచ్చు. Step 3 ఓ బాణలిలో నూనె వేసి ఆవాలు, సెనగపప్పు, మినప్పప్పు వేసి వేయించాలి. తరవాత ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి వేగనివ్వాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్నీ కొబ్బరి తురుమునీ పిండిలో కలపాలి. Step 4 పొంగడాల పెనాన్ని స్టవ్‌మీద పెట్టి ఒక్కో గుంతలో రెండుమూడు చుక్కల నూనె వేసి, పిండి మిశ్రమాన్ని వేసి మూతపెట్టి ఓ నిమిషం ఉడికించాలి. తరవాత చెక్కస్పూనుతో దాన్ని నెమ్మదిగా రెండో వైపునకు తిప్పాలి. ఇలా రెండు వైపులా సిమ్‌లో లేదా మీడియం మంట మీద ఉడికించి దించితే చెట్టినాడ్‌ పొంగడాలు రెడీ.      
Yummy Food Recipes
Add
Recipe of the Day