spicy chilli panner By , 2014-07-24 spicy chilli panner spicy chilli panner - its a very yammi recipe, itsa spicy and tasty item easy preparation spicy chilli panner. Prep Time: 10min Cook time: 35min Ingredients: తగినంత నూనె, 1 టేబుల్ స్పూన్ టమాట సాస్, 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 2 టేబుల్ స్పూన్ సోయాసాస్, అర కప్పు వెజిటేబుల్ స్టాక్ (కూరగాయలు ఉడికించిన నీరు), 4 పచ్చిమిర్చి, 2 క్యాప్సికమ్, 2 ఉల్లిపాయలు, 5 వెల్లుల్లి రెబ్బలు, అరటీస్పూన్ మిరియాలపొడి, 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 500 గ్రా పన్నీర్, Instructions: Step 1 ముందుగా ఒక గిన్నెలో కార్న్ ఫ్లోర్, మిరియాలపొడి, ఉప్పు కొద్దిగా నీళ్ళు వేసి చిక్కగా కలుపుకోవాలి. Step 2 ఇప్పుడు డీఫ్ ప్రైయింగ్ పాన్ స్టవ్ మీద పెట్టి నూనె వేసి వేడి చేయాలి. Step 3 తర్వాత అందులో పనీర్ ముక్కలను కార్న్ ఫ్లోర్ మిశ్రమంలో డిప్ చేసి కాగే నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి. గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ డీప్ ఫ్రై చేసుకోవాలి. Step 4 తర్వాత మరో పాన్ లో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి అందులో వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకటి రెండు నిముషాలు ఫ్రై చేసుకోవాలి. అందులోనే ఉల్లిపాయ మరియు క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మెత్తగా వేగిన తరువాత అందులో పచ్చిమిర్చిముక్కలు వేసి వేగించి, వెంటనే వెజిటేబుల్ స్టాక్ మరియు ఉప్ప కూడా వేసి బాగా ఉడికించాలి. Step 5 తర్వాత అందులో అజినామోటో, సోయా సాస్, టమోటో సాస్, చిల్లీ సాస్ వేసి మరో 5 నిముషాలు మీడియం మంట మీద ఉడికించుకోవాలి. Step 6 తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ అరకప్పు నీటిలో వేసి బాగా మిక్స్ చేసి, ఉడుకుతున్న మిశ్రమంలో పోసి బాగా మిక్స్ చేయాలి. Step 7 మొత్తం నీరు డ్రై అయ్యే వరకూ మరో 5నిముషాలు ఉడికిన తర్వాత అందులో పనీర్ ముక్కలు వేసి బాగా మిక్స్ చేయాలి. Step 8 మొత్తం ఉడికిన ఫ్రై అవుతున్న సమయంలో స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే హాట్ అండ్ స్పైసీ చిల్లీ పనీర్ రిసిపి రెడీ. .
Yummy Food Recipes
Add