pista barfi By , 2014-07-24 pista barfi pista barfi - its a dessert recipe, Barfi is a special Indian sweet prepared with khoya. It is one sweet which is a perfect choice for any occasion. easy preparation pista barfi...... Prep Time: 20min Cook time: 35min Ingredients: కొన్ని చుక్కలు గ్రీన్ ఫుడ్ కలర్, చిటికెడు ఏలకులపొడి, అరకప్పు కోవా, పావు కప్పు నెయ్యి, అరకప్పు నీళ్ళు, 1 కప్పు పంచదార, 1 కప్పు పిస్తా, Instructions: Step 1 ముందుగా పిస్తాని వేడినీళ్ళలో ఉంచి దాని పొట్టు తీసి పక్కన పెట్టాలి. . Step 2 పాన్ స్టౌమీద పెట్టి, కొద్దిగా నెయ్యి వేసి, ఈ పిస్తాపప్పులను వేసి క్రిస్పీగా ఫ్రై చేసుకొని చల్లార్చి మిక్సీలో వేసి పొడర్ చేసుకోవాలి. Step 3 ఇప్పుడు ఒక డీప్ బాటమ్ పాన్ లో నీళ్ళు పోసి బాగా మరిగించి అందులో పంచదార వేసి బాగా మరిగించాలి. పంచదార వేడినీటిలో కరిగి, చిక్కగా తయారయ్యే సమయంలో అందులో పిస్తాపౌడర్, గ్రీన్ ఫుడ్ కలర్ మరియు కోవా వేసి బాగా మిక్స్ చేయాలి. Step 4 మీడియం మంట మీద 15-20నిముషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు నెయ్యి, యాలకుల పొడి వేసి కలియబెడుతూ 10నిముషాలు ఉడికించుకోవాలి. Step 5 మొత్తం మిశ్రమం పాన్ కు వదలువుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు ప్లేట్ కు కొద్దిగా నెయ్యి రాసి ఈ మొత్తం మిశ్రమాన్ని ప్లేట్ లో పోయాలి . ఇది మొత్తం ప్లేట్ లో సమానంగా సర్ధాలి. చల్లారిన తర్వాత మీకు నచ్చిన షేప్ లో కట్ చేసుకోవాలి. అంతే పిస్తా బర్ఫీ రెడీ.
Yummy Food Recipes
Add