qubani ka meetha recipe By , 2017-07-15 qubani ka meetha recipe Here is the process for qubani ka meetha making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 40min Ingredients: అప్రికాట్లు(ఎండు ఖుబాని పండ్లు): 20,,పండ్లను నానబెట్టిన నీళ్లు: ఎన్ని ఉంటే అన్ని,,పంచదార: రుచికి సరిపడా,,బాదంపప్పు: 2 టేబుల్‌స్పూన్లు,,జీడిపప్పు: 2 టేబుల్‌స్పూన్లు,,రాస్బెరీక్రీమ్‌: టేబుల్‌స్పూను(ఇష్టమైతేనే),,మీగడ(మలై): టేబుల్‌స్పూను, Instructions: Step 1 ఎండు ఖుబాని పండ్లను రాత్రంతా నానబెట్టాలి. లేదంటే గోరువెచ్చని నీళ్లలో ఐదు గంటలు నానబెట్టినా సరిపోతుంది.  Step 2 ఉదయానికి ఉబ్బి మృదువుగా అవుతాయి. వీటిని నీళ్లలోంచి తీసి లోపలి గింజలు తీసేయాలి(ఈ గింజల్ని పగులగొడితే బాదంపప్పు లాంటిదే ఉంటుంది. దీన్ని తీసి పక్కన ఉంచాలి). నానబెట్టిన నీళ్లను పారబోయకుండా పక్కన ఉంచాలి.  Step 3 బాణలిలో పండ్లు నానబెట్టిన నీళ్లు పోసి, గింజలు తీసేసిన పండ్లను వేసి సిమ్‌లో ఉడికించాలి.  Step 4 అవి మృదువుగా అయి రంగు మారుతుంటాయి. తరవాత పంచదార వేసి, అవసరమైతే మరికాసిని పండ్లను నానబెట్టిన నీళ్లు పోసి కలుపుతూ అవి మృదువుగా అయ్యే వరకూ ఉడికించాలి.  Step 5 పండ్లను గరిటెతో మెత్తగా మెదపాలి. తరవాత రాస్బెరీ క్రీమ్‌తోబాటు మీగడ(మలై) కూడా వేసి కలపాలి.  Step 6 చివరగా ఖుబానీ గింజల నుంచి తీసిన పప్పుల్నీ బాదంపప్పుల్నీ జీడిపప్పుల్నీ సన్నని ముక్కలుగా కోసి వేసి కలపాలి.  Step 7 తియ్యతియ్యని ఖుబానీ కా మీఠా రెడీ. దీన్ని విడిగా తిన్నా ఐస్‌క్రీమ్‌తో కలిపి తిన్నా బాగుంటుంది.  
Yummy Food Recipes
Add
Recipe of the Day