masala dal By , 2014-07-23 masala dal masala dal - you bored of eating the same plain dal everyday? So, add a little favour and spices to your boring dal and make it interesting. very easy to make masala dal preparation... Prep Time: 10min Cook time: 35min Ingredients: 2 టేబుల్ స్పూన్ కొత్తిమీర తరుగు, 3 కప్పులు నీళ్ళు, 2 టేబుల్ స్పూన్ నూనె, తగినంత ఉప్పు, 1 ఎండుమిర్చి, 1 టీస్పూన్ జీలకర్ర, 1 టీస్పూన్ జీలకర్రపొడి, 1 టీ స్పూన్ ధనియాలపొడి, 1 టీస్పూన్ కారం, 1 టీ స్పూన్ పసుపు, చిటికెడు ఇంగువ, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టమాటాలు, 1 ఉల్లిపాయలు, అరకప్పు కందిపప్పు, అరకప్పు శనగపప్పు (నీటిలో నానబెట్టాలి), 1 కప్పు పెసరపప్పు, Instructions: Step 1 3 రకాల పప్పులను కడిగి కుక్కర్ లో ఉడికించుకోవాలి. Step 2 ఇప్పుడు ఫ్రైయింగ్ పాన్ లో నూనె వేసి అందులో ధనియాలపొడి, ఇంగువ, ఎండుమిర్చి వేసి ఒక నిముషం ఫ్రై చేసుకోవాలి. Step 3 ఇప్పుడు అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి 3,4 నిముషాలు వేగించుకోవాలి. అలాగే అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరో రెండు, మూడు నిముషాలు వేగించుకోవాలి. Step 4 తర్వాత అందులో కట్ చేసిన టమోటో ముక్కలు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి మరో 4,5నిముషాలు వేగించుకోవాలి. Step 5 ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమంలో ఉడికించుకొన్న పప్పు వేసి బాగా మిక్స్ చేయాలి. సరిపడా ఉప్పు వేసి మరికొన్ని నిముషాలు మీడియం మంట మీద ఉడికించుకోవాలి. Step 6 పచ్చివాసన పోయే వరకూ ఉడికించి, స్టౌ ఆఫ్ చేసి దింపాలి. అంతే టేస్టీ మసాలా దాల్ రిసిపి రెడీ .
Yummy Food Recipes
Add