ladies finger tomato chutney recipe By , 2017-07-07 ladies finger tomato chutney recipe Here is the process for ladies finger tomato chutney making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: బెండకాయ ముక్కలు – 1 కప్పు,,టొమాటో ముక్కలు – 1 కప్పు,,చింతపండు – కొద్దిగా, ధనియాలు – టీ స్పూను,,శనగపప్పు – రెండు టీ స్పూన్లు,,మెంతులు – కొద్దిగా,,మినప్పప్పు – టీ స్పూను,,ఎండుమిర్చి – 8,,ఆవాలు – అర టీ స్పూను,,జీలకర్ర – అర టీ స్పూను,కరివేపాకు – రెండు రెమ్మలు,,ఇంగువ – చిటికెడు,నూనె – నాలుగు టీ స్పూన్లు,,పసుపు – చిటికెడు ఉప్పు – రుచికి తగినంత, Instructions: Step 1 బాణలిలో నూనె వేసి ధనియాలు, శనగపప్పు, మినప్పప్పు, మెంతులు వేసి కొద్దిగా వేగాక, ఎండుమిర్చి కూడా వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి.  Step 2 అదే బాణలిలో మరో రెండు స్పూన్ల నూనె వేసి తరిగిన బెండకాయ ముక్కలు, టొమాటో ముక్కలు, పసుపు వేసి రెండు నిముషాలు వేయించి మూత పెట్టి ఉడికించాలి.  Step 3 వేయించిన ధనియాలను మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకొని, దానిలో నానబెట్టిన చింతపండు, ఉప్పు, ఉడికించి చల్లార్చిన బెండ, టొమాటో మిశ్రమం వేసి మరోసారి మిక్సీ వేయాలి.  Step 4 మరీ మెత్తగా కాకుండా చూసుకోవాలి. బాణలిలో నూనె కాగాక, పోపుదినుసులు వేయించాలి.  Step 5 చిటపటలాడాక కరి వేపాకు, ఇంగువ, ఎండుమిర్చి వేసి వేయించి ఈ పోపును పచ్చడిలో కలపాలి.  Step 6 రుచికరమయిన బెండకాయ టొమాటో పచ్చడి ని సర్వ్ చేయాలి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day