mahwah kaju sandwich recipe By , 2017-08-01 mahwah kaju sandwich recipe Here is the process for mahwah kaju sandwich making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: మెత్తగా పొడి చేసిన కోవా - 150 గ్రా;,పంచదార - 40 గ్రా;,నెయ్యి - టీ స్పూను;,ఖర్జూరాలు - 10 (పాలలో సుమారు పది నిమిషాలు నానబెట్టాలి);,జీడిపప్పు పలుకులు - 3 టేబుల్ స్పూన్లు;,ఏలకుల పొడి - అర టీ స్పూను;,నూనె - కొద్దిగా, Instructions: Step 1 ఒక పాత్రలో కోవా పొడి, పంచదార వేసి స్టౌ మీద ఉంచి ముద్దలా అయ్యేవరకు కలిపి, దించి చల్లారాక ఈ మిశ్రమాన్ని రెండు ఉండలుగా (ఒకటి పెద్దది, ఒకటి చిన్నది) చేసి పక్కన ఉంచాలి.  Step 2 బాణలిలో నెయ్యి వేసి స్టౌ మీద ఉంచి కరిగాక, నానబెట్టి ఉంచుకున్న ఖర్జూరాలు వేసి మెత్తగా గుజ్జులా అయ్యేవరకు కలపాలి.  Step 3 ఏలకుల పొడి, జీడిపప్పు పలుకులు వేసి బాగా కలిపి దించేయాలి.  Step 4 ఒక ప్లాస్టిక్ షీట్ తీసుకుని దాని మీద కొద్దిగా నూనె పూయాలి.   Step 5 ఐదు అంగుళాల వెడల్పు, ఒక అంగుళం లోతు ఉన్న డబ్బా మూత తీసుకుని, అందులో ప్లాస్టిక్ షీట్ ఉంచాలి.  Step 6 తయారుచేసి ఉంచుకున్న కోవా పెద్ద బాల్ తీసుకుని మూత మధ్యలో ఉంచి, చేతితో జాగ్రత్తగా అంచులు కూడా మూసుకునేలా ఒత్తాలి.  Step 7 ఇప్పుడు కోవా మిశ్రమం మీద ఖర్జూరం మిశ్రమం ఉంచి, ఆ పైన చిన్న బాల్ పెట్టి గట్టిగా ఒత్తి పైన సిల్వర్ ఫాయిల్ ఉంచి, ఫ్రిజ్ లో పది నిమిషాలు ఉంచి తీసేయాలి  ఎనిమిది సమాన భాగాలుగా కట్ చేసి అందించాలి.  
Yummy Food Recipes
Add
Recipe of the Day