Manchurian soup recipe By , 2017-06-08 Manchurian soup recipe Here is the process for Manchurian soup making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: ఉల్లిపాయ ముక్కలు-రెండు టేబుల్‌స్పూన్లు,,క్యాబేజి తురుము-ఒక కప,,క్యారట్‌ తురుము -అర కప్పు,,పుదీనా-అర టీస్పూన్‌,,నీళ్లు-రెండు కప్పులు,,మైదాపిండి-పావు కప్పు,,కార్న్‌ఫ్లోర్‌-రెండు టేబుల్‌స్పూన్లు,,సోయాసాస్‌-రెండు టేబుల్‌స్పూన్లు,,మిరియాల పొడి-అర టీస్పూన్‌,,వెల్లుల్లి రెబ్బలు-అర టీస్పూన్‌,,బటర్‌(వెన్న) -ఒక టీ స్పూన్‌,,చిల్లీసాస్‌-పావు టీస్పూన్‌,,ఉప్పు-రుచికి తగినంత,,వంటసోడా-చిటికెడు., Instructions: Step 1 ఒక గిన్నెలో క్యాబేజి తరుము, ఉల్లిపాయ ముక్కలు, పుదీనా, చిల్లీసాస్‌, సోయాసాస్‌, ఉప్పు, వంటసోడా వేసి కలపాలి.  Step 2 తరువాత అందులో మైదాపిండి, కార్న్‌ఫ్లోర్‌ కూడా వేసి తగినంత నీరు పోసి గట్టిగా ఉండే విధంగా కలిపి ఉంచుకోవాలి.  Step 3 స్టవ్‌పై బాణలి ఉంచి అందులో నూనె పోసి అది వేడెక్కాక పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని బంగారు రంగు వచ్చేంత వరకు వేగించాలి.  Step 4 మరో బాణలిలో కొద్దిగా బటర్‌ వేసి అది వేడెక్కాక సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు వేసి వేగించాలి.    Step 5 తర్వాత కొద్దిగా సోయాసాస్‌, చిల్లీసాస్‌ వేసి ఒక్క నిమిషం వేగించి అందులో నీళ్లు పోసి మరగనివ్వాలి.    Step 6 మరో గిన్నెలో కార్న్‌ఫ్లోర్‌లో కొద్దిగా నీళ్లు పోసి కలిపి ఆ మిశ్రమాన్ని మరుగుతున్న నీళ్లలో కలపాలి.    Step 7 సూప్‌ కాస్త చిక్కబడిన తరువాత దించి అందులో మిరియాల పొడి కలపాలి.   Step 8 ఆపైన వేగించి పెట్టుకున్న మంచూరియా బాల్స్‌ వేసి మరో ఐదు నిమిషాలు స్టవ్‌పై ఉడికించి దించేయాలి.    Step 9 సూప్‌ వేడిగా ఉన్నప్పుడే బవుల్‌లో పోసి పైన కొత్తిమీర, సన్నగా తరిగిన క్యారెట్‌ ముక్కలు వేసి సర్వ్‌ చేయాలి.      
Yummy Food Recipes
Add
Recipe of the Day