Sorakaya Sambar Recipe By , 2017-02-13 Sorakaya Sambar Recipe Here is the process for Sorakaya Sambar making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: కందిపప్పు -1 కప్పు,టమాటాలు - 3,సొరకాయ ముక్కలు - 1 కప్పు (పెద్దగా కట్ చేసినవి),మునక్కాడ - 1,చింతపండు గుజ్జు - 1 కప్పు,పచ్చిమిర్చి - 5,ఉల్లిపాయ ముక్కలు - కొన్ని,వెల్లుల్లి ముక్కలు - 1 స్పూన్,సాంబార్ పొడి - 2 స్పూన్స్,కొత్తిమీర, కరివేపాకు - కొద్దిగా,కారం - సరిపడ,పసుపు - 1/4 స్పూన్,ఉప్పు - సరిపడ,నూనె - 4 స్పూన్స్,పోపు గింజలు - 1స్పూన్, Instructions: Step 1 కందిపప్పు ని మెత్తగా ఉడికించి పక్కన పెట్టు కోవాలి. తరువాత మునక్కాడ మరియు టొమాటోలను ముక్కలుగా కట్ చేసుకోవాలి. Step 2 తరువాత ఒక గిన్నెలో సొరకాయ మునక్కాడ ముక్కలు, కొద్దిగా ఉప్పు, పసుపు వేసి 2 గ్లాసుల నీళ్ళు పోసి ఉడికించాలి. సొరకాయ ముక్కలు బాగా ఉడికిన తరువాత చింతపండు గుజ్జు, పచ్చిమిర్చి ముక్కలు, టొమాటో ముక్కలు వేసి మరో 10 నిముషాలు ఉడికించాలి. Step 3 తరువాత అందులో ఉడికించిన పప్పు వేసి బాగా కలిపి మరో గ్లాస్ నీళ్ళు పోసి, సరిపడ కారం, ఉప్పు, సాంబార్ పొడి, కొద్దిగా కరివేపాకు వేసి కొద్దిసేపు ఉడికించాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేసి కాగాక పోపు గింజలు, ఎండు మిర్చి ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు వేసి బాగా వేయించాలి. Step 4 తరువాత ఈ పోపుని మరుగుతున్న సాంబార్ లో వేసి కలిపి మరో 5 నిముషాలు మరిగించి దించెయ్యాలి. అంతే రుచికరమైన సొరకాయ సాంబార్ తయార్. ఈ సాంబార్ ని వేడి అన్నములో కాని ఇడ్లీలో కాని తింటే చాల రుచిగా ఉంటుంది.  
Yummy Food Recipes
Add