Nuvvula Ariselu recipe By , 2017-02-02 Nuvvula Ariselu recipe Here is the process for Nuvvula Ariselu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 40min Ingredients: బియ్యం : ఒక కేజీ,బెల్లం : అరకేజీ,నెయ్యి : పావు కేజీ,నువ్వులు : ఒకకప్పు, Instructions: Step 1 ముందు గా బియ్యాన్ని వాటర్ లో వేసి మూడు గంటలు నాననిచ్చి ఈ బియ్యాన్ని జల్లడ దాంట్లో వేసుకుని నీరు అంత ఆరిపోయాక బియ్యాన్ని పిండి ఆడించాలి.. Step 2 బెల్లాన్ని మెత్తగా కొట్టుకుని ఒక గిన్నె లోకి తీసుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ వేసి స్టవ్ వెలిగించి దాని మీద పెట్టి బాగా మరగనివ్వాలి, గట్టి పాకం రావాలి. Step 3 ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో కొంచెం వాటర్ తీసుకుని అందులో ఈ బెల్లం పాకం వేసుకుని చేత్తో చుస్తే చేతికి పాకం గట్టిగా ముద్దగా అంటుకోవాలి , ఇలా వస్తే మన పాకం కరెక్ట్ అని అర్ధం. Step 4 ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి బెల్లం పాకాన్ని కిందకు దించి అందులో తడి పిండి ని కొంచెం కొంచెం వేస్తూ చెక్క గరిటతో కలుపుకోవాలి, బాగా కలుపుకున్నాక అందులో నెయ్యి వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. Step 5 ఇప్పుడు ఓక గిన్నెలో కి నువ్వులు తీసుకుని అందులో కొంచెం బియ్యం పిండి కలిపిన వాటర్ వేసుకుని కలిపి పెట్టుకోవాలి. Step 6 ఇప్పుడు పిండి ముద్ద ను చేత్తో కొంచెం తీసుకుని ప్లాస్టిక్ కవర్ మీద కొంచెం ఆయిల్ రాసుకుని దాని మీద ఈ పిండి ముద్ద పెట్టి వత్తుకుని దీన్ని మరల నువ్వుల మిశ్రమం లో రెండు వైపులా దొర్లించి కవర్ మీద పెట్టుకుని కొంచెం వత్తుకోవాలి , ఇలా అన్ని చేసి పెట్టుకోవాలి . Step 7 స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి కాగాక అందులో మెల్లగా ఒక్కక్కటి చొప్పున వేసుకుని బాగా వేయించుకుని తీసుకోవాలి ..
Yummy Food Recipes
Add