Meal Maker pakoda recipe By , 2017-06-01 Meal Maker pakoda recipe Here is the process for Meal Maker pakoda making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: మీల్‌మేకర్ - 100గ్రా,కార్న్‌ఫ్లోర్ - 1/2 కప్పు,బియ్యంపిండి - 1/2 కప్పు,శనగపిండి - 1/2 కప్పు,ఉల్లిపాయలు - 2,నిమ్మకాయ - 1,కొత్తిమీర - కొద్దిగా,కరివేపాకు - కొద్దిగా,నూనె - సరిపడ,ఉప్పు, కారం - సరిపడ,అల్లంవెల్లుల్లి పేస్టు - 2 స్పూన్స్, Instructions: Step 1 ముందుగా ఒక పాత్రలో రెండు కప్పుల నీళ్లుపోసి మరిగించుకోవాలి.  Step 2 అందులో మీల్‌మేకర్ వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు వీటిని 10 నిమిషాలు నీళ్లలోనే ఉంచి, తరువాత వేరే పాత్రలోకి మీల్‌మేకర్‌ని తీసుకుని మెత్తగా చేయాలి.  Step 3 అందులో కార్న్‌ఫ్లోర్, బియ్యంపిండి, శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. Step 4 బాణలిలో నూనె పోసి కాగాక పకోడీల మాదిరిగా వేసుకుని ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి.    Step 5 అంతే కర కరలాడే మీల్ మేకర్ పకోడీ రెడీ, వీటిని టొమాటో సాస్ తో తింటే చాల రుచిగా ఉంటాయి.                  
Yummy Food Recipes
Add
Recipe of the Day