Green Piece Masala recipe By , 2017-05-11 Green Piece Masala recipe Here is the process for Green Piece Masala making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: బఠాణీలు - పావు కప్పు,,ఉల్లిగడ్డలు - 3,,లవంగాలు - 2,,యాలకులు - 1,,దాల్చినచెక్క - 1,,టమాటాలు - 5,,అల్లం, వెల్లుల్లి పేస్ట్ - అర టీ స్పూన్,,జీలకర్ర - పావు టీ స్పూన్,,మెంతులు - 5,,కారం - 2 టీ స్పూన్స్,,ధనియాల పొడి - 2 టీ స్పూన్స్,,గరంమసాలా పౌడర్ - అర టీ స్పూన్,,కొత్తిమీర - అర కట్ట,,చక్కెర - కొద్దిగా,,ఉప్పు, పసుపు,,నూనె - తగినంత, Instructions: Step 1 కడాయిలో కొద్దిగా నూనె పోసి జీలకర్ర, మెంతులు వేయించాలి.  Step 2 వీటిని మిక్సీ పట్టి పొడి చేసి పక్కన పెట్టాలి. మళ్లీ కడాయిలో నూనె పోసి ఉల్లిగడ్డలు, అల్లం వేసి వేయించాలి.  Step 3 కొద్దిగా వేగాక టమాటాలను వేసి కలపాలి. టమాటాలు బాగా ఉడకనివ్వాలి.  Step 4 దీన్ని కాసేపు చల్లారనిచ్చి పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి.    Step 5 ఇప్పుడు కుక్కర్‌లో కొద్దిగా నూనె పోసి లవంగాలు, యాలకులు, దాల్చినచెక్క వేసి వేగనివ్వాలి.    Step 6 దాంట్లో టమాటాప్యూరీ వేసి కలపాలి. సన్నని మంట మీద ఐదు నిమిషాలపాటు అలాగే ఉండనివ్వాలి.    Step 7 ఆ తర్వాత గరం మాసాలా పౌడర్, కారం, ధనియాల పొడి పసుపు వేసి కలపాలి.    Step 8 రెండు నిమిషాలాగి బఠాణీలు వేసి రెండు కప్పుల నీళ్ళుపోయాలి.    Step 9 దీంట్లో ధనియాలపొడి, చక్కెర, ఉప్పు వేసి కలపాలి. పదినిమిషాలపాటు సన్నని మంట మీద ఉడకనివ్వాలి. చివరగా కొత్తిమీర వేసి దించేయాలి. నోరూరించే గ్రీన్ పీస్ మసాలా రెడీ!           
Yummy Food Recipes
Add