Sorakaya kootu recipe By , 2017-05-03 Sorakaya kootu recipe Here is the process for Sorakaya kootu making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: పచ్చి శనగ పప్పు : కప్పు (నీటిలో ఓ గంట పాటు నానపెట్టాలి),సొరకాయ ముక్కలు : ఒకటిన్నర కప్పు,పసుపు : చిటికెడు,కొబ్బరి పొడి : చిన్న కప్పు,పచ్చిమిరపకాయలు : మూడు లేదా నాలుగు,జీలకర్ర : అర టీస్పూను,ఆవాలు : టేబుల్ స్పూను,ఎండుమిరపకాయలు : రెండు లేదా మూడు,ఇంగువ : చిటికెడు,కరివేపాకు : కొద్దిగా,నూనె : తగినంత, Instructions: Step 1 ముందుగా కొబ్బరి పొడి, పచ్చి మిరపకాయలు, జీలకర్ర మూడింటిని కొద్దిగా నూనె పోసి ముద్దగా నూరుకోవాలి.  Step 2 ఇప్పుడు మందపాటి గిన్నె లేదా బాండిలో కప్పు నీరు పోసి నానపెట్టి పెట్టుకున్న శనగపప్పు, సొరకాయ ముక్కలు వేసి ఉడికించుకోవాలి.  Step 3 కుక్కర్లో అయితే ఒకటి రెండు విజిల్స్ రాగానే దింపేసుకోవాలి.  Step 4 ఆ నీరు ఒంపకుండా అందులోనే రుబ్బి పెట్టుకున్న కొబ్బరి ముద్ద, ఉప్పు, పసుపు వేసి కూర ముద్దగా అయ్యేంత వరకు ఉడికించాలి.    Step 5 ఇప్పుడు మరొక గిన్నెలో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిరపకాయలు, ఇంగువ వేసి వేయించుకోవాలి.    Step 6 చివరగా ఇంగువ కూడా జతచేసి ఈ తిరగమోతను ఉడుకుతున్న సొరకాయ కూటుకు జతచేయాలి. చివరగా కరివేపాకు, కొత్తిమీర, చల్లి దించేయాలి. ఇది చపాతీల్లోకి చాల రుచిగా ఉంటుంది.          
Yummy Food Recipes
Add
Recipe of the Day