Tamarind prawns recipe By , 2017-04-03 Tamarind prawns recipe Here is the process for Tamarind prawns making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: చింత చిగురు- కప్పు  , కాస్త పెద్ద రొయ్యలు- పావుకిలో  , ధనియాల పొడి- చెంచా  , జీలకర్రపొడి- అరచెంచా  , ఉల్లిపాయ- ఒకటి  , కొత్తిమీర- కట్ట  , వెల్లుల్లి రేకలు- ఐదారు  , నూనె- మూడు టేబుల్‌స్పూన్లు  , గసగసాల పొడి - చెంచా  , దాల్చిన చెక్కపొడి - అరచెంచా  , అల్లంవెల్లులి పేస్టు- చెంచా  , పసుపు- చిటికెడు  , ఉప్పు- తగినంత  , పచ్చిమిర్చి- ఐదు  , కారం - చెంచా., Instructions: Step 1 ముందుగా రొయ్యలని శుభ్రం చేసి పెట్టుకుని అందులో పసుపూ, కొద్దిగా ఉప్పూ, సగం అల్లంవెల్లుల్లి పేస్టు వేసి వాటికి పట్టేట్టుగా కలిపిపెట్టుకోవాలి.  Step 2 ఇప్పుడు కడాయిలో నూనె వేసి అది వేడెక్కాక తరిగిన ఉల్లిపాయముక్కలూ, పచ్చిమిర్చీ వేసి దోరగా వేయించుకోవాలి.  Step 3 ఉల్లిపాయ ముక్కలు వేగాక అందులో రొయ్యలు కూడా వేయాలి. పచ్చివాసన పోయేవరకూ వేయించి అప్పుడు మూత పెట్టి మరికాస్త సేపు మగ్గనివ్వాలి Step 4 ఇప్పుడు చింతచిగురుని అరచేతుల్లో వేసి బాగా నలిపితే పొడిలా తయారవుతుంది.  Step 5 దీన్ని రొయ్యల్లో వేసి మిగిలిన అల్లంవెల్లుల్లి పేస్టూ, వెల్లుల్లిరేకలూ చేర్చాలి. Step 6 తర్వాత ఉప్పూ, కారం, గసగసాలపొడీ, జీలకర్రపొడి, దాల్చిన చెక్కపొడి, ధనియాలపొడి వేసుకోవాలి.  Step 7 అవన్నీ వేసి బాగా కలిపిన తర్వాత కాసిని నీళ్లు పోసి మూతపెట్టేయాలి.  Step 8 ఇందులో ప్రత్యేకించి మసాలా వేయాల్సిన అవసరం లేదు. కూర దగ్గరకు వచ్చిన తర్వాత దింపేసి, కొత్తిమీరతో అలంకరిస్తే చాలు.   
Yummy Food Recipes
Add
Recipe of the Day