koramenu fish curry recipe By , 2017-04-03 koramenu fish curry recipe Here is the process for koramenu fish curry making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: కొరమీను చేపలు – 1 కిలో,ఉల్లిపాయలు – 2 కప్పులు తరిగినవి,పసుపు – చిటికెడు,ఉప్పు – తగినంత,నూనె – కావలసినంత,కారం – రుచికి సరిపడా,అల్లంవెల్లుల్లి పేస్ట్‌ – తగినంత,పచ్చిమిరపకాయలు – 3,ధనియాల పొడి – 1/4 టీ స్పూను,గరం మసాలా – 1/4 టీ స్పూను,కొత్తిమీర , కరివేపాకు రెబ్బలు, Instructions: Step 1 కొరమీను చేపను కడిగి శుభ్రం చేసుకోవాలి.  Step 2 దానిలో తగినంత కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, అల్లంవెల్లుల్లి పేస్ట్‌, గరం మసాలా వేసి 20 నిమిషాలపాటు నానబెట్టాలి.  Step 3 ఆ తర్వాత గ్యాస్ వెలిగించి ఓపాత్ర పెట్టి అందులో నూనె పోసి వేడి చేయాలి.  Step 4 నూనె కాగాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలను వేసి వేయించుకోవాలి. Step 5 బాగా వేగాక చేప ముక్కలు కూడా చేర్చి 2 నిమిషాలు వేయించి తగిన నీళ్లు పోసి మూత పెట్టి సన్నని మంట మీద ఉడికించాలి.  Step 6 చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసి రెండు నిమిషాల తరువాత దించెయ్యాలి.  Step 7 చల్లారిన తరువాత ఇంకా రుచిగా ఉండే ఈ పులుసు రెండు రోజులైనా అదే రుచితో ఘుమఘుమలాడుతూ ఉంటుంది.   
Yummy Food Recipes
Add