Pottelu talakaya recipe By , 2017-03-11 Pottelu talakaya recipe Here is the process for Pottelu talakaya making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: పొట్టేలు తలకాయ మాంసం : 1 కేజి,నూనె : 50 గ్రా.,ఉల్లిపాయలు : 50 గ్రా.,పచ్చిమిర్చి : 50 గ్రా.,అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ : 50 గ్రా.,కొబ్బరిపొడి : ఒక స్పూన్‌,మిర్యాల పొడి : కొద్దిగా,కారంపొడి : సరిపడినంత,ఉప్పు : సరిపడినంత,ధనియాల పొడి : ఒక స్పూన్‌, Instructions: Step 1 ముందుగా పొట్టేలు తలకాయ మాంసంను, ఉప్పు కలిపి కుక్కర్‌లో వేసి అందులో లీటర్‌ నీరు పోసి స్టౌ మీద పెట్టాలి. Step 2 ఆరేడు విజిల్స్‌ వచ్చాక కుక్కర్‌ను స్టౌ మీద నుండి దించేయాలి. Step 3 కొంత మంది కుక్కర్‌ కాకుండా పెద్దగిన్నెలోకి మాంసంను తీసుకొని కట్టెల పొయ్యి మీద బాగా ఉడికిస్తారు. Step 4 అలా ఉడికించిన కూర చాలా రుచిగా ఉంటుందని సీమగ్రామాల్లో పెద్దలు చెప్తారు. Step 5 అలా ఉడికించిన మాంసాన్ని పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో నూనె పోయాలి. Step 6 ఆ తర్వాత నూనె వేడెక్కాక అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పొట్టేలు మెదడు (బ్రెయిన్‌) వేసి ఉడికించుకోవాలి. Step 7 కుక్కర్‌లో ఉడికించిన మాంసంలోకి అల్లం, వెల్లుల్లి పేస్ట్‌, కొద్దిగా కొబ్బరిపొడి, మిర్యాలపొడి, ధనియాల పొడి, కారంపొడి వేసి బాగా ఇగరనిచ్చి దించేయాలి. ఇప్పుడు పొట్టేలు తలకూర రెడీ.
Yummy Food Recipes
Add
Recipe of the Day