Udardal Pizza recipe By , 2017-03-07 Udardal Pizza recipe Here is the process for Udardal Pizza making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: మినప్పప్పు - కప్పు,బియ్యం రవ్వ - రెండు కప్పులు,ఇంగువ - రెండు చిటికెలు,పచ్చిమిర్చి - 2; ఉప్పు - తగినంత,వంటనూనె - తగినంత,పచ్చిబఠాణీ - రెండు టీ స్పూన్లు,క్యారట్ తురుము - రెండు టీ స్పూన్లు,క్యాప్సికమ్ తరుగు - పావు కప్పు,ఉల్లికాడల తరుగు - టీ స్పూను,జీలకర్ర - టీ స్పూను,వెన్న - రెండు టీ స్పూన్లు,టొమాటో రసం - టీస్పూను,, Instructions: Step 1 ముందురోజు రాత్రి మినప్పప్పు, బియ్యపురవ్వలను విడివిడిగా నానబెట్టుకోవాలి. Step 2 మరుసటి రోజు మినప్పప్పులో నీరు వడకట్టి, గ్రైండర్‌లో వేసి మెత్తగా రుబ్బుకుని పక్కన ఉంచుకోవాలి. Step 3 బియ్యపురవ్వలో నీటిని పూర్తిగా తీసేసి ఆ రవ్వను మినప్పిండిలో వేసి బాగా కలిపి ఒకరోజంతా నాననివ్వాలి. Step 4 తరువాతి రోజు ఆ పిండిలో ఉప్పు, టొమాటోరసం, పచ్చిమిర్చి పేస్ట్, ఇంగువ వేసి బాగా కలపాలి. Step 5 లోతుగా ఉండే వెడల్పైన బాణలిని స్టౌ మీద ఉంచి రెండు టీ స్పూన్ల నూనె వేసి వేడయ్యాక రెండు గరిటెల పిండిని అందులో వేసి సమానంగా పరచాలి. Step 6 దానిపైన క్యాప్సికమ్ తరుగు, క్యారట్ తురుము, ఉల్లికాడలు, పచ్చి బఠాణీలు, కొద్దిగా జీలకర్ర వేయాలి. Step 7 పైన మూత ఉంచి ఆవిరి మీద (సన్న మంట మీద) ఉడకనివ్వాలి. గరిటెను అందులో గుచ్చి చూస్తే దానికి పిండి అంటుకోకపోతే ఉడికినట్లే. Step 8 ఇది కొద్దిగా చల్లారిన తర్వాత తినేముందు వెన్న వేసి సర్వ్ చేసుకోవాలి. ఇది ఇటాలియన్ పిజ్జాకు ఏ మాత్రం తీసిపోదు సరికదా, ఎంతో ఆరోగ్యం.
Yummy Food Recipes
Add