Alu Rajma Tikka recipe By , 2017-03-03 Alu Rajma Tikka recipe Here is the process for Alu Rajma Tikka making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: బంగాళదుంపలు: 3,రాజ్మా గింజలు: 1/2 cup,ఉల్లిపాయ: 1 (తరిగిన),అల్లం వెల్లుల్లి పేస్ట్: 3 tsp,మామిడి పొడి: 2 tbsp,రాజ్మామసాలా పొడి: 1 tsp,ధనియా, జీరాపొడి: 1 tsp,పసుపు: 1/4 tsp,కారం: 2 tsp,ఫుదీనా: 1 కట్ట,కొత్తిమిర: 1 కట్ట,మొక్కజొన్న పిండి: 3 tbsp,ఉప్పు: రుచికి సరిపడ,నూనె: వేగించడానికి కావలసినంత, Instructions: Step 1 రాజ్మాను ఒక రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే ఉడికించి, ఆరబెట్టి, మెదిపి ప్రక్కన పెట్టుకోవాలి. Step 2 బంగాళదుంపల్ని మెదిపి అందులో రాజ్మా, ఉల్లిపాయముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మామిడి పొడి, రాజ్మామసాల పొడి, దనియా, జీరా పొడి, పసుపు, కారం, తరిగిన పుదీనా, కొత్తిమిర, ఉప్పు వేసి బాగా కలిపి చిన్న, చిన్న ఉండలుగా చేసుకొని పక్కనపెట్టుకోవాలి. Step 3 ఇలా తయారు చేసుకొన్న ఉండలను మొక్కజొన్న పిండిలో దొర్లించి, కాస్త ఒత్తుతూ పెనం పై రెండు వైపులా బంగారు రంగు వచ్చేలా వేగించుకోవాలి. వీటిని వేడి వేడి గా పెరుగు చెట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి.
Yummy Food Recipes
Add
Recipe of the Day