Mumbai Chicken Biryani Recipe By , 2016-10-27 Mumbai Chicken Biryani Recipe classic south east asian Mumbai Chicken Biryani Recipe. Prep Time: 25min Cook time: 50min Ingredients: ఒక కేజీ(మీడియం సైజులో కట్ చేసుకున్న) చికెన్ ,అరకిలో బియ్యం ,ఒక టీస్పూన్ ఉప్పు,ఒక కప్పు దొరగా వేయించుకున్న ఉల్లిపాయ ముక్కలు,ముప్పావు వంతు కప్పు నూనె,మూడు టీ స్పూన్ల అల్లం పేస్ట్,మూడు టీ స్పూన్ల వెల్లుల్లి పేస్ట్,ఒక కప్పు పెరుగు,1 టీ స్పూన్ గరం మసాలా,2 టేబుల్ స్పూన్ల కారం పొడి,2 స్పూన్ల జీలకర్ర పొడి,ఎనిమిది పచ్చిమిర్చి (పేస్ట్ చేసుకోవాలి),అర కట్ట కొత్తిమీర: 1/2కట్ట,మూడు బంగాళదుంపలు: 3,1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా,ఆరు పచ్చిమిర్చి(కాయలు),చిటికెడ్ ఎల్లో ఫుడ్ కలర్,ఒక స్పూన్ కెవ్రా ఎసెన్స్ (పై రెండు లేకున్న ఫర్వాలేదు), Instructions: Step 1 ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో చికెన్ ముక్కలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం పేస్ట్, ఉప్పు, కారం, జీలకర్ర, అన్ని రకాల మసాలా పొడులు వేసి కనీసం ఒక గంట సేపు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. Step 2 తర్వాత బియ్యం శుభ్రంగా కడిగి కొద్దిగా ఉప్పువేసి సంగం ఉడికేవరకూ ఉడికించి పెట్టుకోవాలి. Step 3 ఇప్పుడు బంగాళదుంపల యొక్క పొట్టు తొలగించి ముక్కలుగా కట్ చేసి శుభ్రంగా కడిగి ఫ్రైయింగ్ పాల్ లో వేసి ఫ్రై చేసి పెట్టుకోవాలి. Step 4 తర్వాత ఒక బౌల్ లో రెండు టేబుల్ స్పూన్ల నీళ్ళు పోసి అందులో ఎల్లో ఫుడ్ కలర్ వేయాలి. Step 5 ఇప్పుడు ఒక మందపాటి పాత్రలో ముందుగా సగం ఉడికించి పెట్టుకొన్న అన్నంవేసి పాత్రమొత్తం సర్ధాలి. తర్వాత దానికి మీద ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ వేసి సర్దాలి, తర్వాత బంగాళదుంపలు, అరకప్పు వేగించుకొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర మరియు పచ్చిమిర్చి తరుగు వేసి సమంగా సర్దుకోవాలి. ఇలా రెండు మూడు లేయర్స్ గా మొత్తం సర్దుకోవాలి. Step 5 తర్వాత పైన ఎల్లో ఫుడ్ కలర్ మిక్సర్ ను వేసి మూత పెట్టి, చాలా తక్కువ మంట మీద 15నిముషాలు ఆవిరి మీద మాత్రమే ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల సగం ఉడికిన అన్నం, పూర్తిగా ఉడుకుతుంది, మరియు చికెన్, బంగాళదుంపలు కూడా మెత్తగా ఉడుకుతాయి. Step 5 మొత్తం ఉడికించుకొన్న తర్వాత మూత తీసి అందులో కెవ్రా ఎసెన్స్ ను చిలకరించి, మూత పెట్టి మరో రెండు నిముషాలు ఉడికించుకోవాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేసి క్రిందికి దింపుకోవాలి. అంతే బాంబే బిర్యానీ రిసిపి రెడీ. ఇంకేం నిమ్మకాయ్, ఉల్లిపాయ సలాడ్ తో కానిచ్చేయండి.
Yummy Food Recipes
Add