Capsikam Alu Kurma Recipe By , 2016-12-05 Capsikam Alu Kurma Recipe Here is the making process for Capsikam Alu Kurma. Just follow the simple tips and cook mouth watering Capsikam Alu Kurma. Prep Time: 20min Cook time: 25min Ingredients: కాప్సికం ముక్కలు- 2 కప్పులు,బంగాళా దుంపల ముక్కలు - 1 కప్పు,ఉల్లిపాయలు- 2,పచ్చిమిర్చి- 2,కొబ్బరి పొడి- 3 టి.స్పూన్,ధనియాలు - 1 టి.స్పూన్,జీడిపప్పు- 5,గసగసాలు- 1 టి.స్పూన్,గరం మసాలా పొడి- 1/4 టి.స్పూన్,పెరుగు- 1/2 కప్పు,టమాటాలు - 2,పసుపు - 1/4 టి.స్పూన్,కారం పొడి - 1 టి.స్పూన్,అల్లం, వెల్లుల్లి ముద్ద- 1 టి.స్పూన్,ఉప్పు- తగినంత,నూనె - 3 టి.స్పూన్లు, Instructions: Step 1 కాప్సికం, బంగాళాదుంపల్ని ఒకే సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. Step 2 పెనం వేడిచేసి ధనియాలు, గసగసాలు దోరగా వేయించుకోవాలి. Step 3 కొబ్బరి పొడి, వేయించిన ధనియాలు, గసగసాలు, జీడిపప్పు, టమాటాముక్కలు, పెరుగు కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. Step 4 పాన్లో నూనె వేడి చేసుకుని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా బంగార రంగు వచ్చేవరకు వేయించుకుని పసుపు, అల్లం,వెల్లుల్లి ముద్దవేసి మరి కొద్దిగా వేయించాలి. Step 5 ఇందులో బంగాళా దుంపల ముక్కలు, కాప్సికం ముక్కలు, కారం పొడి, ఉప్పువేసి కలిపి మూతపెట్టి మగ్గనివ్వాలి. Step 6 ముక్కలు కాస్త మెత్తబడిన తర్వాత తయారుచేసుకున్న మసాలాముద్దను, కప్పుడు నీళ్లుపోసి కలిపి మూతపెట్టి ఉడికించాలి. కూర ఉడికి నూనె తేలుతున్నప్పుడు గరంమసాలా పొడి వేసి కలిపి దింపేయాలి. ఈ కూర పులావ్, రోటీ, నాన్, పరాఠాలకు బావుంటుంది.
Yummy Food Recipes
Add
Recipe of the Day