Dondakaya Pachadi recipe By , 2017-02-28 Dondakaya Pachadi recipe Here is the process for Dondakaya Pachadi making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: దొండకాయలు - పావుకిలో,,ఆవపిండి - 100గ్రాములు,,కారం - 100గ్రాములు,,ఉప్పు - 100గ్రాములు,,నువ్వలనూనె - పావుకిలో,,పసుపు - అర టీ స్పూను,,ఇంగువ - చిటికెడు,,మెంతిపిండి - ఒక టీ స్పూను,,చింతపండు - 50గ్రాములు లేదా,నిమ్మకాయలు(పెద్దవి) - రెండు., Instructions: Step 1 ముందుగా దొండకాయల్ని శుభ్రంగా కడిగి పొడిబట్టతో తుడిచి ఆరబెట్టుకోవాలి. Step 2 ఆరిన తరువాత కాయలకి చిన్న పుల్లతో గాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో కొద్దిగా నూనెపోసి అందులో ఈ దొండకాయల్ని వేసి స్టౌమీద పెట్టాలి. Step 3 ఈ గిన్నెపై మరో వెడల్పాటి గిన్నెపెట్టి అందులో నీళ్లుపోయాలి. ఇప్పుడు దీన్ని చిన్నమంటపై మగ్గనివ్వాలి. కాయలు మెత్తపడ్డాక దించేయాలి. Step 4 ఇప్పుడు ఒక గిన్నెలో ఆవపిండి, కారం, ఉప్పు, మెంతిపిండి, పసుపు వేసి బాగా కలుపుకుని పెట్టుకోవాలి. Step 5 ఉడికిన దొండకాయలపై నిమ్మరసం వేసి బాగా కలిపి ఆవపిండిలో వేసి కలుపుకోవాలి. Step 6 మిగిలిన నూనెని వేడిచేసి అందులో ఇంగువ వేసి దొండకాయలపై పోయాలి. Step 7 ఆవపిండి కాయలకు పట్టేలా బాగా కలుపుకుని ఒక గాజుసీసాలో భద్రపరుచుకోవాలి. Step 8 మూడవ రోజున తింటే ఎంతో రుచిగా ఉంటుంది. ఈ దొండకాయల ఆవకాయ నెలరోజుల వరకూ పాడవకుండా ఉంటుంది.
Yummy Food Recipes
Add
Recipe of the Day