RajBhog recipe By , 2017-02-27 RajBhog recipe Here is the process for RajBhog making .Just follow this simp Prep Time: 15min Cook time: 30min Ingredients: పాలు 1 లీటరు,పంచదార - 1 కప్పు,నీళ్లు - రెండున్నర కప్పులు,వెనిగర్ - 1 స్పూన్,బొంబాయిరవ్వ - 1 స్పూన్,పచ్చికోవా - 1 స్పూన్,రోజ్‌వాటర్ - 1 స్పూన్,జీడిపప్పు - ఆరు పలుకులు,బాదం పప్పు- ఆరు పలుకులు, Instructions: Step 1 పాలను మరిగించిన తరువాత, స్పూన్ వెనిగర్‌ను స్పూన్ నీళ్లలో కలిపి, పాలలో వేయాలి. దీంతో పాలు విరిగిపోతాయి. Step 2 ఇప్పుడా పాలను తీసి సన్నటి మంచి క్లాత్‌లో వేసి నీటిని వేరు చేయాలి. మిగిలిన చిక్కటి మిశ్రమం (చనా)కు రవ్వ కలిపి బాగా మెదాయించాలి. Step 3 ఇప్పుడా మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టాలి. జీడిపప్పు, బాదంపప్పును సన్నగా గ్రైండ్ చేసి, కోవా కలపాలి. Step 4 ఇప్పుడు ముందుగా తయారు చేసి పక్కన పెట్టుకున్న పాల విరుగు వుండలకు మధ్యలో చిన్న కన్నం చేసి, కొద్దిపాటి జీడిపప్పు, బాదం పప్పు మిశ్రమాన్ని వుంచి, మళ్లీ ఉండను యధాప్రకారం సరిచేయాలి. ఉండలకు పగుళ్లు లేకుండా చేసుకోవాలి. Step 5 ప్రెషర్ కుక్కర్‌లో రెండు కప్పుల నీళ్లు, 3/4 కప్పు పంచదార వేసి, సన్నటి సెగపై మరిగించాలి. Step 6 బాగా మరిగిన తరువాత ఈ ఉండలను నెమ్మదిగా జారవిడిచి, కుక్కర్ మూత పెట్టి, వెయిట్ వుంచాలి. Step 7 పది నిమషాలు వుంచి, వెంటనే స్టవ్ ఆర్పి, చల్లటి నీళ్లు జల్లి కుక్కర్‌ను వేగం చల్లారనివ్వాలి. Step 8 అవసరమైతే నీళ్ల టాప్ కింద వుంచొచ్చు. కుక్కర్ మూత తీయకుండా ఓ అరగంట వదిలేసి, ఆపైన తీసి, కాస్త రోజ్ వాటర్ కలిపి, ఆపై ఫ్రిజ్‌లో వుంచాలి. బాగా చల్లగా తయారయ్యాక సర్వ్ చేయాలి.
Yummy Food Recipes
Add