Allam Pachadi By , 2017-02-11 Allam Pachadi Here is the process for Allam Pachadi making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 45min Ingredients: అల్లం - 50 గ్రా,బెల్లం - 100 గ్రా,చింతపండు - 50 గ్రా,ఎండు మిర్చి - 10 -15,నూనె - 1/2 కప్పు,ఉప్పు - సరిపడ,మినపప్పు - 2 స్పూన్స్,శెనగపప్పు - 2 స్పూన్స్,మెంతులు - 1/4 స్పూన్,జీలకర్ర - 1 స్పూన్,కరివేపాకు - కొద్దిగా, Instructions: Step 1 ముందుగా అల్లన్ని శుభ్రంగా కడిగి, పొట్టు తీసేసి, చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. Step 2 బాణలిలో కొద్దిగా నూనె వేడి చేసి అల్లంముక్కలు వేసి రంగు మారి మంచి వాసన వచ్చే వరకూ వేయించాలి. చింతపండు కడిగి, కొన్ని నీళ్లలో నాన పెట్టుకోవాలి. తరువాత బాణలిలో కొద్దిగా నూనె వేసి ఎండుమిర్చి వేసి వేయించాలి. Step 3 చల్లారాక ఎండుమిర్చి, చింతపండు, బెల్లం, ఉప్పు వేసి గ్రైండ్ చేయాలి. Step 4 తరువాత అల్లంముక్కలు కూడా వేసి మెత్తగా రుబ్బాలి. తరువాత ఈ పచ్చడి పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె పోసి బాగా కాగిన తరువాత ఆవాలు, మెంతులు, మినపప్పు,శెనగపప్పు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా వేయించాలి Step 5 బాగా వేగిన తరువాత స్టవ్ మీద నుండి దించి కరివేపాకు వేసి ఈ పోపుని కొద్ది సేపు చల్లార నివ్వాలి. బాగా చల్లారిన తరువాత దీనిని పొడిగా ఉన్న డబ్బాలో పెట్టుకుంటే కనీసం 7 -10 రోజుల వరకు నిల్వ ఉంటుంది.  
Yummy Food Recipes
Add
Recipe of the Day