pudina paneer pulao recipe By , 2017-05-15 pudina paneer pulao recipe Here is the process for pudina paneer pulao making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: బాస్మతి రైస్‌-2 కప్పులు,పన్నీర్‌-200గ్రా (చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి),తాజా పుదీనా-ఒక కట్ట,ఉల్లిపాయలు-2 (సన్నగా కట్‌ చేసుకోవాలి),పచ్చిమిర్చి-4,,అల్లం-చిన్నముక్క,వెల్లుల్లిపాయలు-4,,చెక్క-చిన్నముక్క,ఉప్పు-రుచికి సరిపడా,,నూనె-రెండు చెంచాలు,నీళ్లు-4 కప్పులు, Instructions: Step 1 ముందుగా బియ్యాన్ని శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి. Step 2 తరువాత బియ్యంలో నాలుగు కప్పుల నీరు పోసి అన్నం వండి పక్కన పెట్టాలి. Step 3 ఇప్పుడు పాన్‌లో కొద్దిగా నూనెవేసి పన్నీర్‌ ముక్కలు వేసి ఫ్రై చేసి పెట్టుకోవాలి.  Step 4 అంతలోపు పుదీనా ఆకులను శుభ్రం చేసుకోవాలి.    Step 5 తరువాత శుభ్రం చేసుకున్న పుదీనాలో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి మెత్తగా పేస్ట్‌లా తయారుచేసుకోవాలి.   Step 6 ఇప్పుడు పాన్‌లో నూనె వేసి వేడిచేసి అందులో చెక్క లవంగాలు వేసి ఒక నిముషం పాటు వేయించుకోవాలి.    Step 7 తరువాత అందులో సన్నగా తురుముకున్న ఉల్లిపాయముక్కలు వేసి రెండు నిమిషాలు వేయించుకోవాలి.   Step 8 తరువాత అందులో ముందుగా తయారుచేసుకున్న పుదీనాపేస్ట్‌, ఉప్పు వేసి మరో రెండు నిమిషాలు వేయించుకోవాలి.   Step 9 చివరగా ఉడికించి పెట్టుకున్న అన్నం, ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్‌ ముక్కలను కూడా వేసి మరో రెండుమూడు నిమిషాలు ఫ్రై చేసుకుని స్టౌఆఫ్‌ చేయాలి. అంతే పుదీనా పన్నీర్‌ పలావ్‌ రెడీ.      
Yummy Food Recipes
Add
Recipe of the Day