here is the preparation process for Mutton palao By , 2016-11-03 here is the preparation process for Mutton palao Everybody likes Non Veg especially Mutton. For Mutton lovers here the process of delicious Mutton palao. Prep Time: 45min Cook time: 45min Ingredients: మటన్ - ఒక కిలో,పలావు బియ్యం- ఒక కిలో,ఉల్లిపాయలు- రెండు (పెద్దవి),పచ్చిమిర్చి- ఇరవై,జీడిపప్పు - రెండు వందల గ్రాములు,నెయ్యి- ఆరు స్పూనులు,కొత్తిమీర - రెండు కట్టలు,లవంగాలు - పదహారు,యాలకులు- ఎనిమిది,వెల్లుల్లి ముద్ద - రెండు స్పూన్లు,అల్లం - చిన్న ముక్క,దాల్చిన చెక్క - పది గ్రాములు,గసగసాలు - యాబై గ్రాములు,ధనియాలు - యాబై గ్రాములుపలావు ఆకులు - పది గ్రాములు,మరాటీ మొగ్గ - పది గ్రాములు,కొబ్బరికాయ - ఒకటి,నిమ్మకాయలు - నాలుగు,పుదీనా - ఒక కట్ట,ఉప్పు - సరిపడా,పెరుగు - లీటరు, Instructions: Step 1 పచ్చి మిర్చి, గసగసాలు, అల్లం, ధనియాలు వీటిని విడివిడిగా మెత్తగా నూరాలి, కొబ్బరి తురిమి పాలు తీసుకోవాలి, ఉల్లిపాయలను నిలువుగా తరిగిపెట్టుకోవాలి. Step 2 మటన్ ను చిన్న చిన్న ముక్కలుగా కోసి పెరుగు, నాలుగు నిమ్మకాయల రసం , తగిన ఉప్పు, ముందుగా నూరిపెట్టుకున్న వాటిలో సగాన్ని, నూరిపెట్టుకున్న అల్లంవెల్లులిలో సగాన్ని వేసి బాగా కలిపి ఒక దళసరి గిన్నెను స్టవ్ మీద పెట్టి నెయ్యి పోసి బాగా కాగిన తరువాత అందులో అన్ని కలిపిన మటన్ ను వేసి నీరు అంతా ఎగిరిపోయే దాక ఇగర బెట్టాలి. Step 3 ఇప్పడు మరొక పెద్ద బాణలి తీసుకుని అందులో నెయ్యి వేసి పొయ్యి మీద పెట్టి అందులో ఉల్లిపాయలు వేసి దోరగా వేయించాలి. Step 4 అందులోనే చెక్క, లవంగాలు, జీడిపప్పు, మరాటీ మొగ్గ, పలావు ఆకు, వేసి కాసేపు వేగనిచ్చి, మిగిలిన అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసి కొంత సేపు వేగాక అందులో అరలీటరు కొబ్బరి పాలు, లీటరు నీళ్ళు కొలిచి పోసుకోవాలి. Step 4 ఇందులోనే పుదీనా, కొత్తిమీర, తగినంత ఉప్పు వేసి బాగా మరగనిచ్చి ఎసరు మరిగేటప్పుడు కడిగివుంచుకున్న బియ్యాన్ని కూడా వేయాలి. Step 4 అన్నం వుడుకుతుండగా ముందుగా ఉడికించి ఉంచుకున్న మటన్ ను కూడా అందులో వేసి బాగా కలబెట్టి మూత పెట్టాలి. Step 4 తరువాత అది బాగా మగ్గాక పది నిమిషాలు వుంచి దింపేయాలి. దీనిలో పెరుగు చట్నీ గాని, కుర్మా గాని బాగుంటుంది.
Yummy Food Recipes
Add
Recipe of the Day