Paya soup By , 2016-12-18 Paya soup Here is the making process for Paya soup. Just follow the simple tips and cook mouth watering Paya soup. Prep Time: 20min Cook time: 45min Ingredients: మేక కాళ్లు - 4 (నాలుగేసి ముక్కలుగా కట్ చేయాలి),టొమాటో ప్యూరీ - కప్పు+,ఉల్లితరుగు - రెండు కప్పులు,గరంమసాలా - టీ స్పూను,అల్లంవెల్లుల్లి పేస్ట్ - 2 టీ స్పూన్లు,ధనియాలపొడి - టేబుల్ స్పూను,పచ్చిమిర్చి - 5,కొబ్బరితురుము - 2 టేబుల్ స్పూన్లు,కారం - 2 టీ స్పూన్లు,మిరియాల పొడి - టీ స్పూను (పొడి మరీ మెత్తగా ఉండకూడదు),పసుపు - కొద్దిగా,కొత్తిమీర తరుగు - టేబుల్ స్పూను,నూనె - 3 టేబుల్ స్పూన్లు,లవంగాలు - 6,ఏలకులు - 4,దాల్చినచెక్క - చిన్న ముక్క,బిరియానీ ఆకు - 1,ఉప్పు - తగినంత, Instructions: Step 1 ఒక కప్పు ఉల్లితరుగు, కొత్తిమీర, పచ్చిమిర్చి, కొబ్బరితురుము వేసి మెత్తగా పేస్ట్ చేసి, పక్కన ఉంచాలి. Step 2 లెగ్ పీసులను శుభ్రంగా కడగాలి. దీనిలో లీటరు నీరు, పసుపు, ఉప్పు జత చేసి కుకర్‌లో ఉంచి ఆరు విజిల్స్ రానివ్వాలి. Step 3 బాణలిలో నూనె కాగాక, లవంగాలు, ఏలకులు, దాల్చినచెక్క, బిరియానీ ఆకు వేసి బాగా కలిపి, అల్లంవెల్లుల్లి పేస్ట్ జత చేయాలి. Step 4 ఉల్లితరుగు వేసి రెండు నిముషాలు వేయించాలి. Step 5 ధనియాలపొడి, కారం, గరంమసాలా, మిరియాలపొడి వేసి ఒక నిముషం పాటు వేయించాలి. Step 6 ఈ మొత్తం మిశ్రమాన్ని, కుకర్‌లో ఉడికించి ఉంచుకున్న లెగ్ పీస్‌లలో వేసి, తరువాత టొమాటో ప్యూరీ జత చేసి సుమారు రెండు నిముషాలు సన్నని మంట మీద ఉడికించాలి. Step 7 తయారుచేసి ఉంచుకున్న కొబ్బరి మసాలా, అర లీటరు నీరు జతచేసి, మంట పెద్దది చేసి ఆరు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి.
Yummy Food Recipes
Add